బజాజ్ పల్సర్ కు రికార్డ్ స్థాయిలో అవార్డులు | 2015 ZigWheels Awards: Bajaj Pulsar RS200 is the Bike of the Year | Sakshi
Sakshi News home page

బజాజ్ పల్సర్ కు రికార్డ్ స్థాయిలో అవార్డులు

Published Thu, Mar 24 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

బజాజ్ పల్సర్ కు రికార్డ్ స్థాయిలో అవార్డులు

బజాజ్ పల్సర్ కు రికార్డ్ స్థాయిలో అవార్డులు

 హైదరాబాద్: బజాజ్ ఆటో కంపెనీకి చెందిన పల్సర్ బైక్ రికార్డ్ స్థాయిలో 15 అవార్డులను సాధించింది. భారత ఆటోమొబైల్ చరిత్రలో అత్యధిక సంఖ్యలో అవార్డులు సాధించిన బైక్‌గా పల్సర్ ఆర్‌ఎస్ 200 నిలిచిందని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ సంస్థలందించే ఇయర్ ఆఫ్ ద బైక్ అవార్డులతో పాటు వివిధ కేటగిరిల్లో ఉత్తమ బైక్‌గా కూడా అవార్డులను ఈ పల్సర్‌ఆర్‌ఎస్ 200 బైక్ గెల్చుకుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్‌వాస్ పేర్కొన్నారు. ఈ అవార్డులు బజాజ్ ఆటో నిబద్ధతకు, ఉత్పత్తి నాణ్యతకు గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. దేశీయ స్పోర్ట్స్ మోటార్‌బైక్ మార్కెట్లో ప్రతి నెలా 50 వేల పల్సర్ బైక్‌లు విక్రయమవుతున్నాయని పేర్కొన్నారు. భారత దేశపు నంబర్ వన్ స్పోర్ట్స్ సెల్లింగ్ బైక్‌గా 14 సంవత్సరాలు నిలిచిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement