ముంబై: దేశీ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 2020 నాటికి 500 బిలియన్ డాలర్లకి చేరుతుందని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ల సంయుక్త నివేదిక పేర్కొంది. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల దీనికి కారణంగా ఈ నివేదిక పేర్కొంది. ‘డిజిటల్ పేమెంట్స్ 2020’ నివేదిక ప్రకారం.. 2030 నాటికి నగదు లావాదేవీలను డిజిటల్ పేమెంట్స్ అధిగమిస్తాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపు, మూవీ టికెట్స్ బుకింగ్ అంశాలు టాప్‌లో ఉన్నాయి.