హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయి ర్‌టెల్ దేశంలో తొలిసారిగా ‘ఎయిర్‌టెల్ హోమ్’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏదేని కస్టమర్ కంపెనీ నుంచి పొందే సేవలన్నిటికీ ఇక నుంచి ఒకే బిల్లు ఉంటుంది.
ఉదాహరణకు ఒక వినియోగదారుడు లేదా కుటుంబం ఎయిర్‌టెల్ నుంచి మొబైల్ పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్లు తీసుకున్నారని అనుకుందాం. ఇప్పటి వరకు ఈ సేవలకు వేర్వేరుగా బిల్లులు వచ్చేవి. ఎయిర్‌టెల్ హోమ్‌లో భాగంగా ఒక ఇంటికి/కుటుంబ సభ్యులకు కలిపి ఒకే బిల్లు వస్తుందన్న మాట. భారత్‌లో మొదటిసారిగా ఈ సేవలను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టడం విశేషం. రెండు నెలల్లో ఇతర నగరాలకు విస్తరిస్తారు.
10 శాతం డిస్కౌంట్..
ఎయిర్‌టెల్ హోమ్ వినియోగదారుడిని ప్రైమ్ కస్టమర్‌గా కంపెనీ భావిస్తుంది. వీరికి ప్రతి నెల మొత్తం బిల్లులో 10 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఒక కుటుంబంలోని ఎయిర్‌టెల్ కస్టమర్లు దేశంలో ఎక్కడున్నా ఒకే బిల్లు కిందకు తేవడానికి వీలవుతుంది.
ప్రత్యేక కస్టమర్ కేర్ విభాగం ఎయిర్‌టెల్ హోమ్ వినియోగదార్ల కోసం పనిచేస్తుంది. వేర్వేరు బిల్లుల చెల్లింపు తేదీలను గుర్తు పెట్టుకోవడం సహజంగానే కష్టం. కొత్త సేవలతో అటువంటి ఇబ్బందులేవీ ఉండవని భారతి ఎయిర్‌టెల్ హోమ్స్ సీఈవో జార్జ్ మథెన్ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment