ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ! | Allow govt. staff to choose fund managers: PFRDA | Sakshi
Sakshi News home page

ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!

Published Wed, Apr 13 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!

ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!

ఏపీవై చందాదారులకు ఇవ్వాలంటున్న పీఎఫ్‌ఆర్‌డీఏ
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు/చందాదారులకు ఫండ్ మేనేజర్‌లను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని పీఎఫ్‌ఆర్‌డీఏ భావిస్తోంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్‌ను ఎంచుకునే వెసులుబాటును కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కల్పించాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడుల్లో 5 శాతం వరకూ అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఏఐఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. దీంట్లో 2 శాతం వరకూ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు చేరుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement