లిటిల్‌ జీనియస్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా | Anand Mahindra latest tweet, viral | Sakshi
Sakshi News home page

లిటిల్‌ జీనియస్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా

Published Sat, Aug 11 2018 7:59 PM | Last Updated on Sat, Aug 11 2018 8:39 PM

Anand Mahindra latest tweet, viral - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా  ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తప మనసుకు హత్తుకున్న ఇన్నోవేటివ్‌ ఐడియాలను, వీడియోలను షేర్‌ చేస్తు ఉంటారు. అంతేకాదు అలాంటి వారికి బంపర్‌ ఆఫర్లు ఇవ్వడం కూడా మనకు తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆయన ఓ చిన్నారి ఐడియాకు ఫిదా అయిపోయారు. ఒక బుడతడు మంచం దిగడానికి పాట్లుపడుతూ, చివరకు అక్కడే వున్న దిండును వాడుకున్న వీడియో ఆయనను తాజాగా ఆకట్టుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వీడియోను ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ లిటిల్‌ జీనియస్‌కు తెలివితేటలకు మురిసిపోయిన ఆయన మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చేశారు. దీంతో ఇది వైరల్‌ అయిపోయింది. అది నేనంటే నేనంటూ..ఆ ఆఫర్‌ నాకే  కావాలంటూ ఫన్నీగా కమెంట్‌ చేస్తున్నారు. దానికి ఆయన సమాధానాలు కూడా అంతే పన్నీగా సందడి చేస్తున్నాయి.

ఇంతకీ ఆనంద్‌ మహాంద్ర మన బుల్లి హీరోకు ఇచ్చిన ఆఫర్‌ ఏంటంటే అత‌డు చదువు పూర్తి చేసుకోగానే ఉద్యోగ కంట్రాక్ట్‌ కుదుర్చుకుంటానంటూ ట్వీట్ చేశారు. సూపర్‌ ఐడియాలతో అత‌డు త‌మ కంపెనీ ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తాడంటూ ట్వీట్‌ చేశారు. అయితే చాలా కాలం క్రితంనుంచి సోషల్‌మీడియాలో షేర​ అవుతున్న వీడియోలో ఉన్న చిన్నారి ఎవరు? ఇపుడు  ఎలా వున్నాడు? వయసు ఎంత?  ఆనంద్‌ మంహీంద్ర ఇచ్చిన ఆఫర్‌ను  అందిపుచ్చుకుంటాడా? ఈ ప్రశ్నల‍్నింటికి సమాధానం   దొరకాలంటే ఈ వీడియోలోని  బుల్లి జీనియస్‌ స్పందించేంతవరకు వేచి చూడక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement