
ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్ వేడుక
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్‌మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారాగణం సందడితో, వీరి ఎంగేజ్‌మెంట్ ఎంతో మెమరబుల్‌గా నిలిచింది. పూల పందిరి కింద ఇషా, ఆనంద్‌లు ఒకరినొకరు రింగ్‌లు మార్చుకుని, సగం పెళ్లి వేడుకను పూర్తి చేసుకున్నారు. అచ్చం సినిమాల్లో చూసిన మాదిరి ముఖేష్ అంబానీ తన కూతురు ఇషాను నడిపించుకుంటూ వచ్చి, ఆనంద్‌కు అప్పజెప్పడం ఎంతో ముచ్చటగా కనిపించింది. ఇషా చేయి పట్టుకుని ముఖేష్ అంబానీ నడిపించుకుంటూ వస్తుంటే.. వారి వెనుకాలే అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ, రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ రాధికా మెర్చంట్‌లు కూడా చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఆకాశ్-శ్లోకా, ఇషా-ఆనంద్ పెళ్లిళ్లను మాత్రమే ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.
అనంత్, రాధిక పెళ్లి వార్త అప్పటి నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అంబానీ కుటుంబం నుంచి కానీ, రాధిక ఫ్యామిలీ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. తాజాగా ఇషా ఎంగేజ్‌మెంట్ వేడుకలో వీరిద్దరూ జంటగా కనిపించడం, ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచింది. అందరి చూపులు వారిపైనే నిలిచాయి. అనంత్, రాధికలు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులే. కొన్ని రోజులుగా వీరు డేటింగ్ చేస్టున్నట్టు తెలుస్తోంది. రాధిక యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్-చైర్మన్ విరేన్ మెర్చంట్ కూతురు. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. ఇషా ఎంగేజ్‌మెంట్‌లో వీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టన్నింగ్ రెడ్ డ్రెస్‌లో రాధిక మైమరిపించారు. అంతకముందు అనంత్ ఎంగేజ్‌మెంట్ వేడుకలో కూడా రాధిక, తన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అప్పుడే అనంత్, రాధికల రిలేషన్ గురించి, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ టీజ్ కూడా చేశారు.

అనంత్ అంబానీ - రాధిక మెర్చంట్