ఈనెల 17 నుంచి భారత్ లో ఐఫోన్ 6 | Apple's latest iPhone to retail in India from Oct 17 | Sakshi
Sakshi News home page

ఈనెల 17 నుంచి భారత్ లో ఐఫోన్ 6

Published Mon, Oct 6 2014 3:59 PM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

ఈనెల 17 నుంచి భారత్ లో ఐఫోన్ 6 - Sakshi

ఈనెల 17 నుంచి భారత్ లో ఐఫోన్ 6

న్యూఢిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6.. భారత్ మార్కెట్లలో అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 6 ధర రూ.53,500 నుంచి రూ.80,500 వరకు ఉండే అవకాశముందని యాపిల్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. భారత్ లో మొదటిసారిగా ముందుగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని యాపిల్ కల్పిస్తోంది. ఐఫోన్ 6 సొంతం చేసుకోవాలనేవారు యాపిల్ స్టోర్ కు వెళ్లి ముందుగా తమ కావాల్సిన ఫోన్ బుక్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను యాపిల్ కంపెనీ గత నెల 9న మార్కెట్లోకి విడుదల చేసింది. ఐ ఫోన్, ఐఫోన్ 6ల్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తదితర వంటి ఫీచర్లున్నాయి. 2జీ, 3జీ, 4 జీనెట్‌వర్క్‌లను ఇవి సపోర్ట్ చేస్తాయి. 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వెర్షన్లలలో ఇవి లభ్యమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement