ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కేంద్రం రుణాలు రూ.4.42 లక్షల కోట్లు!  | April and September, the central bank loans up to Rs 4.42 lakh crore! | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కేంద్రం రుణాలు రూ.4.42 లక్షల కోట్లు! 

Published Sat, Mar 30 2019 1:09 AM | Last Updated on Sat, Mar 30 2019 1:09 AM

April and September, the central bank loans up to Rs 4.42 lakh crore! - Sakshi

న్యూఢిల్లీ:  వచ్చే ఏడాది ప్రథమార్ధం  (2019–2020, ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య)లో కేంద్రం రూ.4.42 లక్షల కోట్ల రుణాలను సమీకరించనుంది.  ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం– 2019–20లో స్థూలంగా రూ.7.1 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలన్నది కేంద్ర బడ్జెట్‌ ప్రణాళిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–2019) అంచనాల కన్నా (రూ.5.71 లక్షల కోట్లు) ఇది అధికం. వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రుణ ప్రణాళికలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్‌ వివరిస్తూ, వచ్చే ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య స్థూల రుణాలు రూ.4.42 లక్షల కోట్లయితే, నికర రుణాలు రూ.3.4 లక్షల కోట్లని తెలిపారు.

స్థూల రుణాల్లో గత రుణాల రీపేమెంట్లూ కలిసి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును 3.4 శాతం వద్ద కట్టడి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గార్గ్‌ పేర్కొన్నారు. ద్రవ్యలోటు కట్టడికి డేటెడ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ట్రెజరీ బిల్లుల ద్వారా మార్కెట్‌ నుంచి కేంద్రం నిధులు సమీకరిస్తుందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement