న్యూఢిల్లీ: దేశీ ఆటోరంగ పరిశ్రమ ఈ ఏడాది జూన్‌లోనూ భారీ క్షీణతను నమోదుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కారణంగా గత నెల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. కొనుగోలుదారులు నామమాత్రంగానే ఉన్నందున ప్యాసింజర్ వాహన విభాగంలోని దిగ్గజ సంస్థలు సైతం ఏకంగా 54–86 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. మారుతీ 54 శాతం తగ్గుదలను చూపగా, హోండా కార్స్ విక్రయాలు ఏకంగా 86 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 82 శాతం తగ్గాయి. గతనెల్లో అమ్మకాలు తగ్గినప్పటికీ.. అంతక్రితం నెల (మే)తో పోల్చితే అమ్మకాలు మెరుగుపడ్డాయని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. మరోవైపు, ట్రాక్టర్ల విక్రయాలు మాత్రం ఈసారి వృద్ధిని నమోదుచేశాయి. మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు 12 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment