Auto sales
-
పేరుకుపోతున్న వాహన నిల్వలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీలర్ల వద్ద ప్యాసింజర్ వాహన నిల్వలు పోగవడం సహజం. ప్రస్తుతం ఉన్న 80–85 రోజుల ఇన్వెంటరీ(గోదాముల్లో అమ్ముడవకుండా ఉన్న నిల్వలు) స్థాయి ఆందోళన కలిగిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) చెబుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.9 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాల నిల్వలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతమవుతోంది.డీలర్ల వద్ద పోగైన వాహనాల విలువ ఏకంగా రూ.79,000 కోట్లు అని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 19 శాతం క్షీణించి 2,75,681 యూనిట్లకు వచ్చి చేరాయి. టూవీలర్స్ అమ్మకాలు 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 1,06,524 యూనిట్లు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 10 శాతం పడిపోయి 74,324 యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్లు 15 శాతం దూసుకెళ్లి 74,324 యూనిట్లను తాకాయి. ఇక అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్స్ 18,99,192 నుంచి 9 శాతం క్షీణించి 17,23,330 యూనిట్లకు పడిపోయాయి. ఇది చివరి అవకాశం..‘భారీ వర్షపాతం, మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమ పనితీరు చాలా వరకు నిలిచిపోయిందని డీలర్లు పేర్కొన్నారు’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మరింత ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి తయారీ సంస్థలకు ఇది చివరి అవకాశం అని అన్నారు. అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా నిరోధించడానికి డీలర్ సమ్మతి, వాస్తవ పూచీకత్తు ఆధారంగా మాత్రమే కఠినమైన ఛానల్ ఫండింగ్ విధానాలను తప్పనిసరి చేస్తూ బ్యాంకులకు సలహా జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఫెడరేషన్ కోరిందన్నారు. ఇదీ చదవండి: ‘పెయిడ్ ట్వీట్’ అంటూ వ్యాఖ్యలుడీలర్లు, తయారీ సంస్థలు పండుగలకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో సానుకూల నగదు ప్రవాహం, మెరుగైన వ్యవసాయ పరిస్థితులు డిమాండ్‌ను పెంచుతాయని ఆశించినప్పటికీ ఆశించినమేర ఫలితం లేదని ఫెడరేషన్ తెలిపింది. అదనపు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి, 2024–25 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి సానుకూల వృద్ధి పథాన్ని నడపడానికి అక్టోబర్ నెల చాలా అవసరమని పేర్కొంది. ఊహించిన విక్రయాలు కార్యరూపం దాల్చకపోతే కొత్త సంవత్సరంలోకి వెళ్లే క్రమంలో డీలర్లతోపాటు తయారీ సంస్థలను కూడా కష్టతర పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది. -
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
టాప్ గేర్‌లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్‌సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
కొనసాగిన ఆటో అమ్మకాల జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్‌లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటి వాహనాల(ఎస్యూవీ)కు డిమాండ్ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్(5% క్షీణత) మినహా టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హెచ్ఎంఎస్ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి. ► విద్యుత్ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ ఏప్రిల్‌లో 62,581 యూనిట్లకు తగ్గాయి. -
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
తస్సాదియ్యా: సెమీ కండెక్టర్ల కొరతున్నా కార్ల కొనుగోలు జోరు తగ్గలేదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీ వాహన విక్రయాలు మేలో జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్‌తో అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మహీంద్రా, కియా, టయోటా, హోండా కార్స్, స్కోడా సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ద్వి చక్ర వాహన, ట్రాక్టర్స్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ‘‘గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్ రెండో దశ కారణంగా కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ రికవరీ దశలో ఉంది. ఉత్పత్తి పెరుగుదలతో కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది’’ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ మేనెల మొత్తం అమ్మకాలు 1,61,413 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే మేలో విక్రయించిన 46,555 యూనిట్లతో పోలిస్తే 224 % అధికంగా ఉంది. టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో 43,341 యూనిట్ల అమ్మకాలతో 185% వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏకంగా 626% వృద్ధితో 3,454 ఈవీలను విక్రయించింది. -
వాహనాల అమ్మకాల జోరు, ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వెహికల్స్ ఇవే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు 2022 ఏప్రిల్‌లో 16,27,975 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ 25 శాతం పెరిగి 2,64,342 యూనిట్లు రోడ్డెక్కాయి. ద్విచక్ర వాహనాలు 38 శాతం ఎగసి 11,94,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహనాలు 52 శాతం దూసుకెళ్లి 78,398 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 96 శాతం, ట్రాక్టర్లు 26 శాతం విక్రయాలు పెరిగాయి. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని రకాల వాహనాల మొత్తం విక్రయాలు గత నెలలో 6 శాతం తగ్గుదల నమోదైంది. ‘రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, చైనా లాక్డౌన్లో ఉన్నందున ఆటో పరిశ్రమ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కొంటోంది. మెటల్ అధిక ధరలు, కంటైనర్ కొరత ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సరఫరా సంక్షోభం కొనసాగుతోంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ తెలిపారు. -
వాహన విక్రయాలు.. టాప్‌గేర్!
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడంతో ఆటో కంపెనీలు మార్చిలో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌లు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. అలాగే టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ మార్చిలో మొత్తం 1.49 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 76,976 యూనిట్లతో పోలిస్తే ఇది 94 శాతం అధికం. ఇదే దేశీయ అమ్మకాలు ఆర్థిక సంవత్సరం 2019–20లో 14,36,124 యూనిట్లుగా నమోదుకాగా, ఆర్థిక సంవత్సరం 2020–21లో 13,23,396 యూనిట్లుకు పరిమితం అయ్యాయి. ‘‘కోవిడ్ సంబంధిత అంతరాలతో గతేడాది మార్చి విక్రయాల్లో 47 శాతం క్షీణత నమోదైంది. ఈ 2021 ఏడాది మార్చిలో నమోదైన విక్రయాల వృద్ధి (48 శాతం)తో పోలిస్తే రికవరీని సాధించినట్లు అవగతమవుతోంది’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే నెలలో దేశీయ వాహన విక్రయాల్లో 100 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుందాయ్ ప్రకటించింది. గతేడాది మార్చిలో 26,300 యూనిట్లను విక్రయించగా, ఈసారి అమ్మకాలు 52,600 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ విభాగంలో మొత్తం 29,654 యూనిట్లను విక్రయించి 422% వృద్ధిని సాధించింది. ఇదే మార్చిలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 15,001 వాహనాలను విక్రయించింది. గతేడాది మార్చిలో అమ్మకాలు 7,023 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా మార్చిలో మొత్తం 16,700 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 3,383 యూనిట్లుగా ఉన్నాయి. బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ300, ఆల్–న్యూ థార్ వంటి మోడళ్లు ఆశించిన స్థాయిలో అమ్ముడయ్యాయని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ కారణంగా అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ ఏడాది మార్చి విక్రయాలు ఇంతలా పెరగడానికి బేస్ ఎఫెక్ట్ కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
వాహన విక్రయాలు డిసెంబర్లో దుమ్ము రేపాయి. డిమాండ్ జోరుగా ఉండటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీల వాహన అమ్మకాలు(హోల్‌సేల్) రెండంకెల మేర వృద్ధి చెందాయి. హ్యుందాయ్, సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీలు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను డిసెంబర్లోనే సాధించాయి. వినియోగదారుల ఆర్డర్లు చెప్పుకోదగ్గ స్థాయిల్లో పెరుగుతున్నాయని, రిటైల్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వాహన కంపెనీలు వెల్లడించాయి. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా అమ్మకాలు జోరుగానే ఉన్నాయని వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. మార్కెట్ వేగంగా రికవరీ అయిందని, వ్యక్తిగత రవాణాకు డిమాండ్ పెరుగుతుండటం కలసివచ్చిందని పేర్కొన్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడి, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న ఆశాభావం వాహన పరిశ్రమలో నెలకొన్నది. మరిన్ని విశేషాలు... ► హ్యుందాయ్ కంపెనీకి అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను గత నెలలోనే సాధించింది. క్రెటా, వెర్నా, టూసన్, ఐ20 మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించడం, క్లిక్టుబై వంటి వినూత్నమైన సేవలందించడం కారణంగా అమ్మకాలు జోరుగా పెరిగాయని ఈ కంపెనీ పేర్కొంది. ► మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగినా, మొత్తం అమ్మకాలు 10 శాతం తగ్గాయి. ► వీఈ కమర్షియల్ వెహికల్స్ దేశీయ అమ్మకాలు 8 శాతం తగ్గినా, ఎగుమతులు 24 శాతం ఎగిశాయి. మొత్తం అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ► అమ్మకాలు గత ఆరు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయని యమహా తెలిపింది. -
2021కి...లాభాలతో స్వాగతం...
ముంబై: స్టాక్ మార్కెట్ 2021 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికింది. ఐటీ, ఆటో, ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించడంతో కొత్త ఏడాది తొలిరోజున రికార్డుల పర్వం కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారమూ లాభాలతో ముగిశాయి. జీఎస్టీ అమలు తర్వాత ఈ డిసెంబర్లో ఒక నెలలో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు వసూళ్లను సాధించడంతో పాటు ఆటో కంపెనీలు వెల్లడించిన వాహన విక్రయ గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అలాగే భారత్‌లో ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించవచ్చనే వార్తలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 47,869 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,018 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 229 పాయింట్లు లాభపడి 47,980 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,050 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు నూతన గరిష్టాలను తాకిన తరుణంలోనూ ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 269 పాయింట్లను ఆర్జించింది. ఆటో షేర్ల లాభాల పరుగులు... డిసెంబర్లో అంచనాలకు తగ్గట్టుగానే వాహన విక్రయాలు జరిగాయని ఆటో కంపెనీలు ప్రకటించాయి. దీనికి తోడు ఇటీవల పలు ఆటో కంపెనీలు తమ వాహనాలపై పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు 4 నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ లిస్టింగ్ విజయవంతం... గతేడాదిలో చివరిగా ఐపీఓను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు ఎక్ఛ్సేంజీల్లో లాభాలతో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 36% ప్రీమియం ధరతో రూ. 436 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో 55 శాతానికి పైగా లాభపడి రూ.489.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరకు 29 శాతం లాభంతో రూ.407 వద్ద స్థిరపడ్డాయి. మునిసిపల్ సోలిడ్ వేస్ట్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి. -
ఒడిదుడుకుల ట్రేడింగ్..!
స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ఛేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాల పాటు ఇదే వారంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. గత వారాంతాన విడుదలైన దేశ క్యూ2(జూలై– సెప్టెంబర్)జీడీపీ గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగడం, అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బిడైన్ పాలన దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలతో గతవారం సెన్సెక్స్ 267 పాయింట్లను, నిఫ్టీ 110 పాయింట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. తగిన స్థాయిలో వాహన విక్రయాలు దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం తమ నవంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పండుగ సీజన్‌తో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి కనబడే అవకాశం ఉందని, వ్యవస్థలో రికవరీతో వాణిజ్య వాహన అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో మెరుగైన వర్షాలతో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగి ఉండొచ్చని, ద్వి – చక్ర వాహన విభాగపు అమ్మకాల్లో మాత్రం ఫ్లాట్ లేదా స్వల్ప క్షీణత నమోదు కావచ్చని వారంటున్నారు. పాలసీ సందర్భంగా జాగరూకత! ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ సమావేశం డిసెంబర్ 2న (బుధవారం) ప్రారంభమవుతుంది. కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం)తన నిర్ణయాలు ప్రకటించనుంది. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశ నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌కు ఎంతో కీలకం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సర్దుబాటు ద్రవ్య విధానానికి కట్టుబడుతూ పాలసీ కమిటీ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 4 శాతం గానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. అండగా ఎఫ్ఐఐల పెట్టుబడులు.. ఈ నవంబర్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 65,317 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొన్నారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చే అంశమని నిపుణులంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీ సమావేశాల నేపథ్యంలో ఎఫ్ఐఐలు స్వల్పకాలం పాటు దేశీయ మార్కెట్లోకి తమ పెట్టుబడులను తగ్గించుకోవచ్చని అంటున్నారు. అయితే దీర్ఘకాలం దృష్ట్యా భారత మార్కెట్ల పట్ల ఎఫ్ఐఐలు బుల్లిష్‌గానే ఉన్నట్లు నిఫుణులంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం... ఈ వారంలో అమెరికా, ఐరోపా, చైనాతో జపాన్ దేశాలు నవంబర్ నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేయనున్నాయి. వారాంతపు రోజున యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, యూరప్ దేశాల అక్టోబర్ రిటైల్ విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. అలాగే ఓపెక్ సమావేశం కూడా నవంబర్ 30న ప్రారంభమై, డిసెంబర్ 1న ముగుస్తుంది. వ్యాక్సిన్ ఆశలతో నవంబర్‌లో క్రూడాయిల్ ధరలు 28 శాతం పెరిగాయి. దీంతో ఓపెక్ క్రూడ్ ధరలను పెంచదని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం బర్గర్ కింగ్ ఐపీఓ ప్రారంభం... ప్రముఖ చెయిన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్ ఐపీఓ డిసెంబర్ 2 న ప్రారంభమై డిసెంబర్ 4 న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.59 – 60 గా నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 450 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రమోటర్ల వాటాలో క్యూఎస్ఆర్ ఆసియా పీటీఈ లిమిటెడ్ 6 కోట్ల షేర్లను అమ్మనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీఓ అనంతరం డిసెంబర్ 14న షేర్లను ఎక్చ్సేంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది(2020)లో బర్గర్ కింగ్ ఐపీఓ 14వది. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ యధావిధిగా పనిచేస్తుంది. -
రివర్స్ గేర్‌లోనే వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీ ఆటోరంగ పరిశ్రమ ఈ ఏడాది జూన్‌లోనూ భారీ క్షీణతను నమోదుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న కారణంగా గత నెల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. కొనుగోలుదారులు నామమాత్రంగానే ఉన్నందున ప్యాసింజర్ వాహన విభాగంలోని దిగ్గజ సంస్థలు సైతం ఏకంగా 54–86 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. మారుతీ 54 శాతం తగ్గుదలను చూపగా, హోండా కార్స్ విక్రయాలు ఏకంగా 86 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 82 శాతం తగ్గాయి. గతనెల్లో అమ్మకాలు తగ్గినప్పటికీ.. అంతక్రితం నెల (మే)తో పోల్చితే అమ్మకాలు మెరుగుపడ్డాయని ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. మరోవైపు, ట్రాక్టర్ల విక్రయాలు మాత్రం ఈసారి వృద్ధిని నమోదుచేశాయి. మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు 12 శాతం పెరిగాయి. -
చైనాలో వాహన విక్రయాలు డౌన్
బీజింగ్: చైనాలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ సెగ తగులుతోంది. జనవరిలో ఆటో అమ్మకాలు .. గతేడాది జనవరితో పోలిస్తే ఏకంగా 20.2 % పడిపోయాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య సీఏఏఎం ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో చైనా సతమతమవుతుండగా.. తాజాగా మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడం.. ఫలితంగా ఫ్యాక్టరీలు, డీలర్‌షిప్‌లు మూతబడటం మొదలైన పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను మరింతగా కుదేలు చేస్తున్నాయి. సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. అయితే, ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచిపోయినా.. కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని, పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు తప్పవని సీఏఏఎం తెలిపింది. -
వాహనాల విక్రయాలు మరోసారి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు డిసెంబరుమాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది. దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 డిసెంబర్లో 1,55,159 యూనిట్లు. గత నెలలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 12.01 శాతం క్షీణించి 6,97,819 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 7,93,042 యూనిట్లు.డిసెంబరులో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.6 శాతం క్షీణించి 10,50,038 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 12,59,007 యూనిట్లు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 12.32 శాతం తగ్గి డిసెంబర్లో 66,622 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ తెలిపింది. 2018 డిసెంబర్లో 16,17,398 యూనిట్ల నుంచి వాహనాల అమ్మకాలు 13.08 శాతం క్షీణించి 14,05,776 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 లో 33,94,790 యూనిట్లతో పోలిస్తే 2019 లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 12.75 శాతం తగ్గి 29,62,052 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం వాహనాల అమ్మకాలు 2019 జనవరి-డిసెంబర్లో 13.77 శాతం తగ్గి 2,30,73,438 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది 2018 లో 2,67,58,787 యూనిట్లుగా ఉన్నాయి. కాగా టాటా మోటార్స్ చైనా మార్కెట్లో మాత్రం వరసగా ఆరు నెలలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించింది. దీంతో మార్కెట్లో టాటా మోటార్స్ షేరు నష్టాలనుంచి లాభాల్లోకి మళ్లింది. మారుతి సుజుకి కూడా లాభపడుతోంది. -
స్టాక్ మార్కెట్ నష్టాల బాట
ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో సాగుతున్నాయి. ఆగస్ట్‌లో ఆటోమొబైల్ విక్రయాలు నిరుత్సాహకరంగా ఉండటం, ఆర్థిక మందగమనం భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 36,454 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 43 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,754 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
విక్రయాల్లో మారుతి హవా
ముంబై: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతు సుజుకి దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటో దిగ్గజం మారుతీ వాహనాల అమ్మకాల్లో మరోసారి తన హవాను చాటుకుంది. నవంబర్ మాసానికిగాను కార్ల విక్రయంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలో డీమానిటైజేషన్ నేపథ్యంలో కూడా దేశీయ మార్కెట్లో నవంబరులో మినీ (ఆల్టో, వ్యాగన్ఆర్) , కాంపాక్ట్ (స్విఫ్ట్, బాలెనో మరియు డిజైర్) విభాగంలో భారీ అమ్మకాలను సాధించింది. మొత్తం అమ్మకాల్లో 12.2 శాతం వృద్ధితో 1.35 లక్షల యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు మరింత అధికంగా 14 శాతం పెరిగాయి. 1.26 లక్షల వాహనాలను అమ్మింది.అయితే ఎగుమతులు మాత్రం 10 శాతం(9.8) క్షీణించాయి.గత ఏడాది 10,225 యూనిట్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది కేవలం 9,225 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది.దీంతో ఆరంభంలో లో మారుతీ సుజుకీ షేరు 0.43 శాతం బలపడినా ప్రస్తుతం 0.19 నష్టాల్లో కొనసాగుతోంది. కాగా దీపావళి సీజన్ తరువాత రీటైల్ డీలర్ల అమ్మకాలు స్వల్పంగా ప్రభావితమైనప్పటికీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. దేశీయ మార్కెట్ లో 47శాతం వాటా ను ఆక్రమించిన మారుతి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులతో ఒప్పందం చేసుకుని 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో కార్లను అందిస్తోంది. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి. -
వాణిజ్య వాహనాల విక్రయాలు పుంజుకుంటాయ్!
ముంబై: వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం తగ్గాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆర్థిక మందగమనం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల అమ్మకాలు ఈ స్థాయిలో క్షీణించాయని పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి అమ్మకాలు పుంజుకోగలవని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు తక్కువగా ఉండడం (లో బేస్), ట్యాక్సీ ఆపరేటర్లు కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయనుండడం, క్రమక్రమంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల కారణంగా అమ్మకాలు పెరుగుతాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలపై ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం.., 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం తగ్గిన వాణిజ్య వాహనాల అమ్మకాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 20% తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6.33 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో వాహన పరిశ్రమ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా నిలకడైన వృద్ధిని సాధించిన తేలిక రకం వాణిజ్య వాహనాల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం తగ్గాయి. ఇక మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం క్షీణించాయి. వాహన పరిశ్రమలో ఆశావహ పరిస్థితులున్నప్పటికీ, కంపెనీలు తేలిక రకం, భారీ తరహా, వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. {పస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నప్పటికీ, వాహన కంపెనీల లాభదాయకత మెరుగుపడే అవకాశాల్లేవు. తీవ్రమైన పోటీ, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తదితర అంశాలు వాహన కంపెనీల లాభదాయకతపై ప్రభావం చూపనున్నాయి. -
ఆ షేర్లే హాట్ కేకులు...!
పలు అనుకూల, ప్రతికూల వార్తలతో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, మార్కెట్ ట్రెండ్ మాత్రం మారుతున్నది. ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్ల దృక్పధంలో మార్పును సూచిస్తూ గతంలో పతనమైన రంగాల షేర్లు క్రమేపీ కోలుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో ర్యాలీ జరిపిన కొద్ది షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు తదితర కారణాలతో ఆర్థిక వ్యవస్థ ఇంకా పతనావస్థలో వున్నా, దేశ ఆర్థిక ఆరోగ్యస్థితిని ప్రతిబింబించే రంగాలకు చెందిన షేర్లు ఇటీవల పెరగడం విశేషం. ఇంకా వడ్డీ రేట్ల తగ్గుదల మొదలు కావొచ్చన్న సంకేతాలేవీ లేకపోయినా, అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించడం విశేషం. బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ మెరుపులు... ఏడాదికాలంగా పలు దఫాలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు 20,500, 6,000 పాయింట్లపైకి పెరగడం, 18,500, 5,400 పాయింట్ల దిగువకు తగ్గడం జరిగింది. అయితే పెరిగిన ప్రతీ సందర్భంలోనూ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపడం, తగ్గినపుడు అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే రంగాలు క్షీణించడం జరిగిపోయేది. అయితే గత రెండు నెలలు, లేదా నెలరోజుల ట్రెండ్‌లో మార్పు జరిగినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీలో భాగంగా వున్న 50 షేర్ల హెచ్చుతగ్గుల డేటా వెల్లడిస్తున్నది. గత 365 రోజుల్లో 10 నుంచి 35 శాతం మేర క్షీణించిన ప్రధాన బ్యాంకింగ్ షేర్లు నెలరోజుల నుంచి 1-12 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఈ నెలరోజుల నుంచి నిఫ్టీ సూచీ కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ, మెటల్ షేరు టాటా స్టీల్ 20 శాతం పెరిగింది. ఏడాదిలో 50 శాతం పడిపోయిన రియల్టీ షేరు జేపీ అసోసియేట్స్ అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో 8 శాతం ఎగిసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నా, ఆటోమొబైల్ షేర్లు మారుతి, మహీంద్రా, టాటామోటార్స్కు మాత్రం ఏడాది నుంచి ప్రతీ క్షీణతలోనూ కొనుగోలు మద్దతు లభిస్తున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ... ఆయా కంపెనీలు మంచి ఫలితాలు వెల్లడించినా, రూపాయి మారకపు విలువ ఇంకా 63 స్థాయివద్దే వున్నా, ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగిసినా నెలరోజుల నుంచి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు క్షీణిస్తున్నాయి. ఏడాది నుంచి ఈ షేర్లు అతిపెద్ద ర్యాలీ జరపడం వల్ల సంవత్సరాంతపు లాభాల స్వీకరణ ఈ క్షీణతకు ఒక కారణమైతే, పెట్టుబడుల ట్రెండ్ మారడం మరో కారణమని బ్రోకింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 2012 నవంబర్ నుంచి 56 శాతం పెరిగిన టీసీఎస్ ఈ ఏడాది సెప్టెంబర్ ఫలితాలు వెల్లడించినప్పటి నుంచి 8 శాతం పడిపోయింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్లది కూడా ఇదే తీరు. 2013 జూలై వరకూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి సహకరించిన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్లు నెల రోజుల నుంచి 3-7 శాతం మధ్య తగ్గాయి. సహజంగానే రాబోయే మార్పులను స్టాక్ మార్కెట్ ముందుగా డిస్కౌంట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో మొదలువుతున్నాయని, దాంతో కొనుగోళ్ల ట్రెండ్ మారిందని ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి బంగారం దిగుమతులు తగ్గడం, దేశంలోకి ఎన్నారైల రెమిటెన్సులు పెరగడం వంటి అంశాలతో వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు నాటకీయంగా తగ్గిందని, ఈ తగ్గుదల ఇలానే కొనసాగితే రూపాయి మారకపు విలువ బలపడి, ద్రవ్యోల్బణం దిగివస్తుందని, తర్వాత ఆటోమేటిక్‌గా రిజర్వుబ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుందనేది దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల అంచనా. ఏడు నెలల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలను తీసుకొస్తుందన్న అంచనాల్ని గోల్డ్‌మాన్ శాక్స్, సీఎల్ఎస్ఏ తదితర అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు వెలువరించాయి. -
పండుగ షి'కారు'!
న్యూఢిల్లీ: వాహన మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు కుదేలై అల్లాడుతున్న వాహన మార్కెట్లో సెప్టెంబర్ మంచి అమ్మకాలనే సాధించింది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు మినహా, మిగిలిన కంపెనీల అమ్మకాలు పుంజుకున్నాయి. వర్షాలు బాగా ఉండడంతో టూవీలర్ల అమ్మకాలు పెరిగాయి. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, యమహా కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు బావుంటాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి. ప్యాకేజీ కావాలి... రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పతి వ్యయాలు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు. దీనిని తట్టుకోవడానికి మంగళవారం నుంచే ధరలు పెంచామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడం, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం, తదితర కారణాల వల్ల వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉందని జీఎం ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ వివరించారు. ప్రస్తుత మందగమనం నుంచి వాహన పరిశ్రమ గట్టెక్కాలంటే ప్యాకేజీ కావాల్సిందేనని ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఫలితంగా వాహన పరిశ్రమతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా పురోగమిస్తుందని వివరించారు. ఇకోస్పోర్ట్ కారణంగా ఫోర్డ్ అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతీ సుజుకి ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. హ్యుందాయ్ ఎగుమతులు 8 శాతం క్షీణించాయి. గత నెలలో గ్రాండ్ కారును మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. హోండా కార్స్ దేశీయ అమ్మకాలు 88 శాతం పెరిగాయి. తమ అమేజ్, బ్రియో కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వివరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2 శాతం, త్రీ వీలర్ల అమ్మకాలు 6 శాతం చొప్పున పెరిగాయి. ఎగుమతులు 12 శాతం క్షీణించాయి. మహీంద్రా ట్రాక్టర్ దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెందినప్పటికీ, ఎగుమతులు మాత్రం 39 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌లో మంచి అమ్మకాలు సాధించామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా చెప్పారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని కుకాస్‌లో రూ.450 కోట్లతో సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డిజైన్ సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇది 2015 మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వివరించారు. నిస్సాన్ ధరలు పెరిగాయ్ నిస్సాన్ కంపెనీ మైక్రా, సన్నీ మోడల్ కార్ల ధరలను 1.4 శాతం నుంచి 2.9 శాతం వరకూ పెంచింది. ఈ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్ (సేల్స్, మార్కెటింగ్) నితీష్ టిప్నిస్ మంగళవారం చెప్పారు. నిస్సాన్ కార్లను హోవర్ కంపెనీయే భారత్‌లో విక్రయిస్తోంది. రూపాయి పతనం, ముడి పదార్థాల ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే ధరలు పెంచుతున్నామని నితీష్ వివరించారు. ధరలను స్వల్పంగానే పెంచామని.. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న నిస్సాన్ కార్లను భారత్‌లో చౌక ధరలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయం పెరగడం తట్టుకోలేక మారుతీ , టయోటా, జనరల్ మోటార్స్, మహీంద్రా హ్యుందాయ్ కంపెనీలు ధరలను పెంచాయి. -
ఆగస్టులోనూ వాహన అమ్మకాలు అంతంతే...
న్యూఢిల్లీ: వాహనాల విక్రయాలు ఈ ఏడాది ఆగస్టులో మిశ్రమంగా ఉన్నాయి. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధనం ధరలకు ఇప్పుడు రూపాయి పతనం కూడా తోడయింది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి వాహన కంపెనీలు ధరలను పెంచాయి. వీటన్నింటి వల్ల వాహన కంపెనీల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య, ప్రయాణికుల వాహనాల అమ్మకాలు తగ్గాయని టాటా మోటార్స్ తెలిపింది. కాగా టయోటా అమ్మకాలు 6 శాతం తగ్గాయి. ఈ కంపెనీ అమ్మకాలు 16,225 నుంచి 15,201కు తగ్గాయి. వర్షాలు బాగా ఉన్నాయని, రానున్న పండుగల సీజన్లో వాహన విక్రయాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ప్యాకేజీ తక్షణావసరం... మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం తగ్గాయి. ఈ కంపెనీ అమ్మకాలు 45,836 నుంచి 37,897కు క్షీణించాయి. దేశీయ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 14 శాతం, ఎగుమతులు 9 శాతం తగ్గాయి. వాహన పరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీ తక్షణావసరమని వివరించారు. ఇక యమహా మోటార్ ఇండియా అమ్మకాలు 67% వృద్ధి చెందాయి. గత ఆగస్టులో 36,432గా ఉన్న యమహా విక్రయాలు ఈ ఏడాది ఆగస్టులో 60,996కు పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 0.57 శాతం పెరిగాయి. కంపెనీ విక్రయాలు 1,54,647 నుంచి 1,55,532కు వృద్ధి చెందాయి. టూవీలర్ల అమ్మకాలు 1.5 శాతం, స్కూటర్ల అమ్మకాలు 4 శాతం చొప్పున తగ్గగా, మోటార్ బైక్‌ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి.