సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన పాపులర్‌మోడల్ చేతక్ స్కూటర్‌ను సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్‌లో బుధవారం లాంచ్ చేసింది. బజాజ్ ట్యాగ్‌లైన్ 'హుమారా బజాజ్' గా 'హుమారా కల్' అనే కొత్త నినాదంతో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అర్బనైట్ ఈవీ బ్రాండ్ కింద తీసుకొచ్చింది. కంపెనీ చాకన్ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
దాదాపు ఒక దశాబ్దం తర్వాత రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మోటారు సైకిళ్లపై దృష్టి పెట్టడానికి బజాజ్ 2009లో సాంప్రదాయ స్కూటర్ల తయారీని నిలిపివేసింది బజాజ్. ఎలక్ట్రిక్ స్పేస్‌లో స్కూటర్లు, త్రీ వీలర్లకు అపారమైన అవకాశం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈరంగంలోకి మొదటగా రావడం, మార్కెట్లో మొదటి స్థానంలో ఉండటం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment