సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ అనూహ‍్యంగా తప్పుకున్న బిన్సీ తాజాగా ఫ్లిప్‌కార్ట్ షేర్లను మాతృసంస్థ వాల్‌మార్ట్ విక్రయించారు. 531 కోట్ల రూపాయల విలువైన 54 లక్షల ఈక్విటీ షేర్లను వాల్‌మార్ట్ లక్సెంబర్గ్ సంస్థ ఎఫ్‌ఐటి హోల్డింగ్స్ సార్ల్‌కు విక్రయించారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో బన్సల్ వాటా 3.85 శాతం నుంచి 3.52 శాతానికి పడిపోయింది.
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో మేజర్ వాటాను (77శాతం) గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సుమారు ఏడాది తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ సంస్థలో తన మొత్తం వాటాలను విక్రయించగా, బిన్సీ బన్సల్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత కొంత కాలానికే లైంగిక ఆరోపణల నేపథ్యంలో బిన్నీ సంస్థనుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment