మార్చి 8న డీ–మార్ట్ ఐపీఓ...
⇒ రూ.1,870 కోట్ల సమీకరణ
⇒ ఇష్యూ ధర రూ.290–299 రేంజ్‌లో...!
న్యూఢిల్లీ: డీ–మార్ట్ సూపర్ మార్కెట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్చి 8న రానున్నది. అదే నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.
ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించాలని అవెన్యూ సూపర్‌మార్ట్స్ యోచిస్తోంది. ఈ సంస్థ విలువ రూ.18,000 కోట్లని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 6.23 కోట్ల షేర్లను రూ.290–299 ధరల శ్రేణిలో జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.