ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎందుకు ఆపేసింది? | Dhirendra Kumar quation to answer | Sakshi
Sakshi News home page

ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎందుకు ఆపేసింది?

Published Mon, Nov 9 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎందుకు ఆపేసింది?

ఆ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎందుకు ఆపేసింది?

ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో నాకు  చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ కేటగిరిలో మంచి పనితీరును కనబరిచిన ఫండ్స్‌లో ఇదొకటి. అయితే ఈ ఫండ్‌లో తాజా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేశారని విన్నాను. ఒక మ్యూచువల్ ఫండ్  ఇలా పెట్టుబడులను ఆపేయవచ్చా? ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్-డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మైక్రో క్యాప్ ఫండ్, తదితర ఫండ్స్‌ను తమ స్కీమ్‌లను కొనసాగిస్తున్నాయి. ఈ ఫండ్స్ తమ స్కీమ్స్‌ను కొనసాగిస్తుండగా, ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకోవడం ఎందుకని ఆపేసింది?               - నవీన్ సాయి, విజయవాడ
 
ఎస్‌బీఐ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ తాజా ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయడం వల్ల మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. రూ.750 కోట్ల వరకూ తమ కెపాసిటీ అని ఫండ్ తన ఆఫర్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఈ టార్గెట్‌కు ఈ ఫండ్ మెల్లగా చేరుకుంటోంది. అందుకనే ఈ స్కీమ్ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకోవడం ఆపేసింది.

పరిమితంగా ఉండే  స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్స్‌తో ఇంత ఇంత భారీ పెట్టుబడులతో మంచి అవకాశాలను పొందడం కొంచెం కష్టమేననని ఈ ఫండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా కొన్నిమిడ్‌క్యాప్ ఫండ్స్ తాజా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తీసుకోవడం ఆపేయడం అసాధారణమేమీ కాదు. గతంలో ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ప్రైమా ఫండ్, హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌క్యాప్ ఫండ్, రిలయన్స్ గ్రోత్ ఫండ్‌లు ఇలానే తాజా పెట్టుబడులను తీసుకోవడం కొంత కాలం పాటు ఆపేశాయి.
 
డెట్ ఫండ్‌కు, రికరింగ్ డిపాజిట్‌కు మధ్య తేడా ఏమిటి? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ప్రస్తుతం నేను ప్రతీ నెలా రూ.3,000 చొప్పున ఆర్‌డీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏడాది లేదా రెండేళ్ల కాలానికి చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మంచి రాబడులు వచ్చే మార్గాలను సూచించండి.
     - కళ్యాణి, కరీంనగర్


రికరింగ్ డిపాజిట్, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను పోల్చడానికి వీలులేదు. రికరింగ్ డిపాజిట్‌లో ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ సురక్షితమైనది.  అంతేకాకుండా నిర్ణీత మొత్తంలో వడ్డీ కూడా వస్తుంది. డెట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ మ్యూచువల్ ఫండ్ ఒక సాధనం.

డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఖచ్చితంగా వచ్చే నిర్ణీతమైన రాబడులంటూ ఏమీ ఉండవు. డెట్ మార్కెట్ పనితీరును బట్టే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడులు ఉంటాయి. చిన్న మొత్తమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆర్‌డీ కన్నా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులు చెప్పుకోదగిన స్థాయిలో ఉండవు.

పన్ను భారాన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పెద్ద తేడా ఏమీ ఉండదు. డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే పన్ను ప్రయోజనాలేమీ ఉండవు. మూడేళ్లలోపే డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను మీ మొత్తం ఆదాయానికి  కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే, 20 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఇండేక్సేషన్‌తో ప్రయోజనంతోకలిపి) చెల్లించాల్సి  ఉంటుంది.
 
నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద పాప కోసం ఎల్‌ఐసీ మ్యారేజ్ ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను. అంతేకాకుండా రెండు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇక నా రెండో కూతురు కోసం సాంప్రదాయ పాలసీలు తీసుకోవాలనుకోవడం లేదు. సిప్-ఎస్‌టీపీ(సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్) ల మేళవింపుతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 15 ఏళ్ల కాలానికి మంచి రాబడులు సాధించాలని నా లక్ష్యం. రెండో పాపకు జీవిత బీమా తీసుకోవాలనుకుంటున్నాను. పిల్లల కోసం టర్మ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా?
 - నందకుమార్, హైదరాబాద్

 
పిల్లలకు బీమా కవర్ అవసరం అని మేమనుకోవడం లేదు. ఆదాయం నష్టపోతే దానికి పరిహారం అందించేదే బీమా. పిల్లలు ఏమీ సంపాదించరు. కాబట్టి వారి విషయంలో ఎలాంటి ఆదాయ నష్టం ఉండదు. బిడ్డ మరణిస్తే, కలిగే ఉద్వేగ నష్టానికి బీమా ఎలాంటి పరిహారం అందివ్వలేదు. మీ పాప కోసం పాలసీ తీసుకోవాలనుంటే, తగినంత లైఫ్ కవర్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. చిన్న మొత్తంలో ప్రీమియమ్‌లు చెల్లించడం ద్వారా పెద్ద మొత్తంలో బీమా కవర్‌ను పొందవచ్చు.

నా కుటుంబం భవిష్యత్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఐదు నుంచి పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను.  మంచి రాబడులు పొందడం కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - భార్గవ, విశాఖపట్టణం

 
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మంచి రాబడులు రావాలంటే... వాటిల్లో కనీసం 5-7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మంచి మ్యూచువల్ ఫండ్స్‌ను రెండు, లేదా మూడింటిని ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ కొత్త అయితే మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి.  బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ డెట్, ఈక్విటీల కాబినేషన్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది.
 
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement