డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఓకేనా? | Dividend yield of investment funds? | Sakshi
Sakshi News home page

డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఓకేనా?

Published Mon, Jun 27 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఓకేనా?

డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఓకేనా?

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్‌పై త్వరలో రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) ప్రభావం ఏ మేరకు ఉంటుంది? మూడేళ్ల లాక్-ఇన్-పీరియడ్ కొనసాగుతుందా? డీటీసీని పరిగణనలోకి తీసుకుంటే ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహమేనా?
- రాజేంద్ర, విశాఖపట్నం

 
డీటీసీ అమల్లోకి వస్తే ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌ను పన్ను-ఆదా చేసే మదుపు సాధనాలుగా పరిగణించలేం. ఈ ఫండ్స్‌కు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ కొనసాగవచ్చు. డీటీసీ అమల్లోకి వస్తే బహుశా ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ తక్కువగా రావచ్చు. పైగా ఈ ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ నుంచి  ఇన్వెస్టర్లు వైదొలిగే అవకాశాలే అధికంగా ఉంటాయి. మొత్తం మీద ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్‌పై డీటీసీ ప్రతికూల ప్రభావమే చూపించే అవకాశాలున్నాయి. అయితే డీటీసీ కారణంగా ఈ ఫండ్ల పనితీరు మాత్రం ప్రభావితం కాకపోవచ్చు. దీర్ఘకాలం నుంచి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగుతుండడమే దీనికి కారణం.
 
బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్ ఫండ్‌లో ఈ ఏడాది జనవరి నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? ఆపేయమంటారా?                        
- రాధిక, విజయవాడ


బిర్లా సన్‌లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్... మంచి డివిడెండ్‌లు చెల్లిస్తున్న ఫండ్స్‌ల్లో ఒకటి. ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్న 6-7 ఉత్తమ ఫండ్స్‌లో ఇది ఒకటని చెప్పవచ్చు.  గత ఐదేళ్ల నుంచే ఈ తరహా డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చాయి. పలువురి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో తప్పనిసరిగా ఉండే ఫండ్స్‌ల్లో ఒకటిగా డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఘనత సాధించాయి. అందుకని ఈ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌ల్లో ఎలాంటి సందేహాలు లేకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.
 
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త.  పదేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను సూచించండి?
- రాజేశ్, కరీంనగర్

 
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కనుక మీరు తొలిసారిగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. అయి తే అగ్రెసివ్‌గా ఉండే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో కాకుం డా కన్సర్వేటివ్‌గా ఉండే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం యూటీఐ బ్యాలెన్స్‌డ్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్‌డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
 
నా వయస్సు 31 సంవత్సరాలు. నేను 60 ఏళ్లకు రిటైరవుతాను. నెలకు రూ.8,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రతి ఏడాది 10 శాతం పెంచగలను. నేను రిటైరయ్యేటప్పటికి రూ.2.5 కోట్ల నిధి ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. ఏయే ఫం డ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటారో తగిన సలహా ఇవ్వండి.           
- వినోద్ కుమార్, హైదరాబాద్  

 
మీరు ఇన్వెస్ట్ చేసే కాలం అధికంగా ఉంది. పైగా ప్రతి ఏడాది మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని 10 శాతం పెంచుతామని అంటున్నారు కూడా. అందుకని మీ రిటైర్మెంట్ నిధి విషయమై మీరు అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే మీరు మీ లక్ష్యాన్ని సాధించగలరు. మీరు మీ ఇన్వెస్ట్‌మెం ట్స్‌ను బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌నుంచి మొదలు పెట్టండి. తొలి 2-3 ఏళ్లలో ఒకటి లేదా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ప్రారంభిం చండి. ప్రతి ఏడాది మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్ పనితీరును మదింపు చేయడాన్ని మరచిపోకండి.
 
నా వయస్సు 44 సంవత్సరాలు. రూ. కోటికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్ టర్మ్ లైఫ్ కవర్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ వార్షిక ప్రీమియమ్ రూ.34,000. కుటుంబంలో నేనొక్కడినే సంపాదనపరుడిని. నేను చెల్లించాల్సిన రుణాలేమీ లేవు. గృహ, వ్య క్తిగత, వాహన,తదితర రుణాలేమీ నేను తీసుకోలేదు. జీవిత బీమా అవసరాల కోసం నేను తీసుకున్న పాలసీ సరిపోతుందా ? తగిన సలహా ఇవ్వండి.                  
- అజయ్, సికిందరాబాద్


మీ కుటుంబంలో మీరు ఒక్కరే సంపాదనపరులు కాబట్టి మీపై ఆధారపడిన వారికి రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకని మీరు తగిన బీమా కవర్ తీసుకోవడం తప్పనిసరి. మీరు లేనప్పుడు  మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోవడానికి, పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నెరవేరేలా మీ జీవిత బీమా కవర్ ఉండాలి. ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని మీ నెలవారీ ఖర్చులు గణించండి.

పిల్లల చదువు, వాళ్ల పెళ్లిళ్లు, మీ జీవిత భాగస్వామికి పెద్ద వయస్సులో అవసరమయ్యే వైద్య సేవలు తదితర ఖర్చులను కూడా లెక్కించి ఎంత జీవిత బీమా కవరేజ్ అవసరమో మదింపు చేయండి. దీనిని బట్టి ప్రస్తు తం మీరు తీసుకున్న బీమా కవరేజ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే బీమా కవర్ పెరిగేలా చూసుకోండి. ఇక మీరు తీసుకున్న పాలసీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్ టెర్మ్ ప్లాన్‌ను పరిశీలిస్తే, ఈ పాలసీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 94 శాతంగా ఉంది.  అయితే ప్రీమియమ్ కొంచెం అధికంగా ఉందని చెప్పాలి.

మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్‌ను మీరు పరిశీలించవచ్చు. ఈ ప్లాన్‌కు ప్రీమియమ్ తక్కువగా ఉంది. మీ వయస్సుకు రూ. కోటి బీమా కవర్‌కు మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ.17,300 (మీరు పొగతాగని వ్యక్తి అయితే) చెల్లించాల్సి ఉంటుంది. అదే  పొగ తాగే అలవాటున్న వ్యక్తికి  ప్రీమియం రూ.29,000గా ఉంటుంది. ఈ పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63% ఉంది.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement