Equity Linked Savings Scheme
-
పన్ను ఆదా.. మంచి రాబడులు
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై ఆదాయపన్ను లేకుండా చూసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈక్విటీ పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకునేందుకు ఇదొక చక్కని ఆప్షన్ కూడా అవుతుంది. కాకపోతే వీటిల్లో పెట్టుబడులను మూడేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు (లాకిన్ పీరియడ్) అవకాశం ఉండదు. పన్ను ఆదా ప్రయోజనం లభిస్తుంది కనుక లాకిన్ పీరియడ్ పెద్ద సమస్య కాబోదు. పైగా పన్ను ఆదా ప్రయోజనాలు కలిగిన సాధనాల్లో తక్కువ లాకిన్ ఉండే సాధనం కూడా ఇదే. ఈ విభాగంలో మెరుగైన, నిలకడైన రాబడులను ఇస్తున్న పథకాలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం (పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇల్లు, రిటైర్మెట్) ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో మంచి నిధి సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. పనితీరు కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ పథకం ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరును 2018 నుంచి నమోదు చేస్తూ వస్తోంది. భారీ అస్థిరతలు కనిపించిన 2020లో ఈ పథకం ఇచ్చిన రాబడులు 27.3 శాతంగా ఉన్నాయి. కానీ ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులు 16 శాతంగానే ఉండడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 56 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 15.54 శాతం, పదేళ్లలో 15.59 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. 1993లో ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 15.42 శాతంగా ఉండడాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని కాలాల్లోనూ ఈ పథకంలో రాబడులు 15 శాతంపైనే ఉండడాన్ని చక్కని, మెరుగైన రాబడులని నిపుణుల అభిప్రాయం. ప్రతీ నెలా ఈ పథకంలో రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈక్విటీ అస్థిరతలను తగ్గించుకునేందుకు సిప్ ప్లాన్ అనుకూలమైనది. పెట్టుబడుల విధానం వైవిధ్యమైన పెట్టుబడుల నిర్మాణాన్ని ఈ పథకం అనుసరిస్తుంటుంది. ఆర్థికంగా బలమైన మూలాలు కలిగి, ఎప్పటికప్పుడు వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీలకు పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తోంది. ఆరు నెలల క్రితం లార్జ్‌క్యాప్‌లో 70 శాతం మేర ఉన్న పెట్టుబడులను తాజాగా 76.5 శాతానికి పెంచుకుంది. మార్కెట్లు గణనీయంగా పెరిగి ఉన్న నేపథ్యంలో దిద్దుబాటు చోటు చేసుకుంటే.. లార్జ్‌క్యాప్ రూపంలో రిస్క్ తగ్గించుకునే వ్యూహం ఇందులో కనిపిస్తోంది. అదే సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ భారీ ర్యాలీ నేపథ్యంలో వీటిల్లో ఎక్స్పోజర్ కొంత తగ్గించుకుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలకు కచ్చితంగా ఫలానా విభాగంలో ఇంత మేర ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధనలు వర్తించవు. కనుక పెట్టుబడుల విషయంలో ఇవి సౌకర్యవంతంగా (ప్లెక్సిబుల్) వ్యవహరించగలవు. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను పరిశీలించినట్టయితే 55 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులున్నాయి. మొత్తం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో (రూ.2,343 కోట్లు) 97.3 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా.. మిగిలిన పెట్టుబడులను డెట్ రూపంలో కలిగి ఉంది. -
గడువు సమీపిస్తోంది.. సిద్ధ్దమేనా?
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను రిటర్నుల దాఖలు దగ్గర నుంచి పలు నిబంధనల అమలు విషయంలో ఎంతో ఊరట కల్పించింది. దీంతో వేతన జీవులకు, ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపశమనం లభించింది. మరి కొన్ని నిబంధనల అమలుకు ఇచ్చిన అదనపు గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. ఈ లోపు అమలు చేయాల్సిన వాటిపై ఇప్పుడే దృష్టి సారిస్తే చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవస్థ తప్పుతుంది. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి కరోనా కారణంగా మరో అవకాశం లభించినట్టయింది. జూన్ 30 వరకు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. అదే విధంగా గతంలో దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేయాలనుకుంటే, దానికి సంబంధించి సవరణ రిటర్నులు వేసుకోవచ్చు. పాన్, ఆధార్ లింక్ చేయలేదా? పాన్ కార్డు కలిగిన ప్రతీ వ్యక్తి విధిగా తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇందుకు సంబంధించిన గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇలా పొడిగింపు ఇచ్చిన గడువు కూడా జూన్ 30తో ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో విడత గడువు పొడిగించే అవకాశాలు లేకపోలేదు. అలా అని ఎంత కాలం పాటు దీన్ని వాయిదా వేయగలం? కనుక పాన్–ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. గడువులోపు ఈ పని చేయకపోతే, ఒకవేళ గడువు పొడిగింపు ఇవ్వని పక్షంలో జూలై 1 నుంచి పాన్ పనిచేయకుండా పోతుంది. దాంతో పాన్ ఇవ్వలేని పరిస్థితి. దీనివల్ల ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. అలాగే బ్యాంకు ఖాతాల ప్రారంభం, బ్యాంకుల్లో డిపాజిట్లు, డీమ్యాట్ ఖాతాల ప్రారంభం, స్థిరాస్తుల లావాదేవీలు, సెక్యూరిటీల లావాదేవీలు, కారు కొనుగోలు వంటివి కష్టంగా మారతాయి. ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు దాటని వారు ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఫామ్ హెచ్15జీ (60 ఏళ్లు దాటిన వారు ఫామ్ 15హెచ్) సమర్పించొచ్చు. తమ ఆదాయం పన్ను వర్తించని కనీస పరిమితి (రూ.2.50 లక్షలు) లోపే ఉంటుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వడమే ఈ పత్రాలను సమర్పించడం. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంకులు మీకు సంబంధించి డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ అమలు చేయకుండా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులు టీడీఎస్ అమలు చేస్తే రిటర్నులు దాఖలు చేసి కానీ రిఫండ్ కోరేందుకు అవకాశం ఉండదు. 2019–20 సంవత్సరానికి ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ సమర్పించేందుకు కేంద్రం జూన్ ఆఖరు వరకు గడువును పొడిగించింది. ఇక 2020–21 సంవత్సరానికి సంబంధించి ఈ పత్రాలను జూన్ 30 నాటికి సమర్పించాలి. దాంతో ఎటువంటి కోతల్లేకుండా చూసుకోవచ్చు. పన్ను ఆదాకు ఇప్పటికీ అవకాశం గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది. వాస్తవానికి మార్చి ఆఖరుతోనే గడువు ముగిసిపోవాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. అదే విధంగా గృహ రుణం (మొదటి ఇంటికి) తీసుకుని దానికి చెల్లింపులు చేస్తుంటే, అసలు, వడ్డీ చెల్లింపులను కూడా రిటర్నుల్లో చూపించుకోవడం ద్వారా పన్ను రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వైద్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులతోపాటు చట్ట పరిధిలో విరాళాలపైనా 2019–20 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను పొందేందుకు ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దు. ఇక కేంద్రం నోటిఫై చేసిన ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ లేదా ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు చట్టపరంగా అవకాశం ఉంది. ఇతర పెట్టుబడులు పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.500, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేయడం తప్పనిసరి. కనుక 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా చేయలేని వారికి గడువు ముగిసిపోయినా ప్రభుత్వం జూన్ 30 వరకు మరో అవకాశం ఇచ్చింది. దీనివల్ల రుసుములు పడవు. అదే విధంగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలోనూ ప్రతి నెలా కనీస మొత్తాన్ని తప్పకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ పడుతుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జమలు చేయలేకపోయినప్పటికీ.. జూన్ 30 నాటికి చేయడం ద్వారా పెనాల్టీ లేకుండా చూసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో 60 ఏళ్లు దాటిన వారు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 55–60 ఏళ్ల మధ్య రిటైర్ అయిన వారు తమ రిటైర్మెంట్ నగదు ప్రయోజనాలను అందుకున్న నెలరోజుల్లోపు ఎస్సీఎస్ఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఇలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉండి, చేయలేకపోయిన వారు జూన్ 30 వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ ఈ ఏడాది మార్చి 20 నుంచి జూన్ 29వ తేదీ మధ్య కాలంలో చేయాల్సిన ముందస్తు పన్ను చెల్లింపులు, టీడీఎస్ వంటి వాటికి గడువు జూన్ 30 వరకు ఉంది. తగ్గించిన పెనాల్టీ చెల్లించడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్లు 234బి, 234సి ప్రకారం ఆలస్యపు చెల్లింపులపై ప్రతి నెలా 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా.. దీనికి బదులు 0.75 శాతం చెల్లిస్తే చాలు. 2020–21 అసెస్మెంట్ (మదింపు) సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు జూన్ 15వ తేదీ. జూన్ 30 తర్వాత చేసే ఆలస్యపు చెల్లింపులపై 1 శాతం పెనాల్టీ చెల్లించాల్సిందే. -
సూచీలకు మించి రాబడి కావాలా?
పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ పథకంలో చేసే పెట్టుబడులు మూడేళ్ల పాటు లాకిన్ అయి ఉంటాయి. మూడేళ్ల తర్వాతే ఉపసంహరణకు అనుమతిస్తారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ముఖ్యంగా ఈఎల్ఎస్ఎస్ విభాగంలో ఈ పథకం పనితీరు టాప్ క్వార్టయిల్లో ఉంటోంది. ఇది ప్రధానంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. చక్కని పనితీరు చూపించడం వల్లే ఈ పథకం నిర్వహణలోని ఇన్వెస్టర్ల నిధులు రూ.17,000 కోట్లకు చేరాయి. ఇంకో విషయం ఏమిటంటే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో అతి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో కలిగిన పథకం ఇది. డైరెక్ట్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 1.07 శాతమే కావడం గమనార్హం. పనితీరు, పెట్టుబడుల విధానం 2009 చివర్లో ఈ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకుంటే ప్రామాణిక సూచీ బీఎస్ఈ 200 ఇచ్చిన రాబడుల కంటే ఈ పథకం రాబడులే ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు 18.2 శాతం. ప్రామాణిక సూచీ రాబడులు 13.5 శాతమే. మూడేళ్ల కాలంలో 14.3 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 24.2 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, మూడేళ్ల కాలంలో బీఎస్ఈ 200 రాబడులు 13.3 శాతం, ఐదేళ్ల కాలంలో 16.5 శాతంగానే ఉన్నాయి. 2011 బేర్ మార్కెట్లో, 2013, 2015 ఆటుపోట్ల సమయంలో లేదా 2012, 2014, 2017 ర్యాలీ సమయాల్లో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. 2011 మార్కెట్ల పతనంలో సురక్షితమైన కన్జూమర్ నాన్ డ్యురబుల్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వెంటనే సైక్లికల్ రంగాల స్టాక్స్‌ను కొనుగోలు చేయడంతో 2012 ర్యాలీలోనూ పాల్గొనగలిగింది. బుల్ మార్కెట్ల సమయంలో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 20 శాతం పెట్టుబడులు పెట్టింది. ఒక్క 2016లోనే ఈ పథకం పనితీరు కాస్త తడబడింది. ఈక్విటీల్లో 98 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడమే కారణం. అలాగే, ఫార్మా రంగం ప్రతికూలతలు ఎదుర్కొంటుంటే ఆ స్టాక్స్‌లో పెట్టుబడులను 11–12 శాతం స్థాయిలో కొనసాగించడంతో పనితీరుపై ప్రభావం పడింది. ఈ అనుభవంతో ఇటీవలి మార్కెట్ కరెక్షన్ నేపథ్యంలో ఈక్విటీలో ఎక్స్పోజర్ను 93–95 శాతానికి పరిమితం చేసింది. రంగాలకు ప్రాధాన్యం... వృద్ధి ఆధారిత పెట్టుబడుల విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. దాదాపుగా బ్లూచిప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కరెక్షన్ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులను 10 శాతానికే పరిమితం చేసింది. బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. -
పన్ను ఆదా చేసే పథకం
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. గతేడాది పన్ను ఆదా కోసం హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారు... ఈ సారి అలా చేయకుండా తమకు అనుకూలమైన పన్ను ఆదా పథకాలపై ప్రారంభంలోనే దృష్టి సారించడం మంచిది. ముఖ్యంగా ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత కలిగిన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకం (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలు ఇన్వెస్టర్ల ఎంపికను కష్టతరం చేస్తాయి. కనుక పనితీరు ఆధారంగా పరిశీలించతగిన పథకాల్లో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఒకటి. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు చక్కని రాబడులకు ఇందులో అవకాశం ఉంటుందని భావించొచ్చు. రాబడులెలా ఉన్నాయంటే... గడిచిన ఏడాది, మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈఎల్ఎస్ఎస్ విభాగంలో ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకానొక మెరుగైన పథకంగా ఉంది. అయితే, 2014 నాటి ర్యాలీలో ఈ పథకం పనితీరు మిగిలిన పథకాలతో వెనుకబడినా, బెంచ్ మార్క్ కంటే ఎక్కువే రాబడులు ఇచ్చింది. ఇక గడిచిన రెండు సంవత్సరాల్లో ఈఎల్ఎస్ఎస్ విభాగంలో దీని పనితీరు అత్యుత్తమంగా ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. నెలవారీగా సిప్ లేదా ఏక మొత్తంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గడిచిన ఏడాదిలో 17.68 శాతం, మూడేళ్లలో 12.75 శాతం, ఐదేళ్లలో 19.56 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. పదేళ్ల కాలంలో రాబడులు వార్షికంగా 14.6 శాతం చొప్పున ఉన్నాయి. బెంచ్‌మార్క్ బీఎస్ఈ 200 రాబడులతో పోలిస్తే 5–6 శాతం అధికంగానే లాభాల్ని ఇస్తోంది. ఏడాది, మూడేళ్లలో యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ పథకాల కంటే మెరుగైన రాబడులనే అందించింది. 2008, 2011 మార్కెట్ పతనాల సమయంలో మిగిలిన ఈఎల్ఎస్ఎస్ పథకాల కంటే, బెంచ్ మార్క్ కంటే ఈ పథకం పెట్టుబడులు విలువ తక్కువగా క్షీణించడం గమనార్హం. గడిచిన ఐదేళ్ల కాలంలో బెంచ్ మార్క్‌తో పోలిస్తే 83 శాతం సమయాల్లో ఈ పథకమే రాణించింది. పెట్టుబడుల్లో వైవిధ్యం ఈ పథకం పెట్టుబడుల్లో చక్కని వైవిధ్యం ఉండడం ఇన్వెస్టర్ల కోణంలో సానుకూలం. పోర్ట్‌ఫోలియోలో 71 శాతం స్టాక్స్ ఉంటే, ఇవి 26 రంగాలకు చెందినవి కావడం పెట్టుబడుల వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఇక రిస్క్ ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోవడం గమనించాల్సిన అంశం. దీనివల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈ రంగాలకు ప్రాధాన్యం బ్యాంకింగ్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. 2014లో బ్యాంకింగ్ రంగానికి 25 శాతం కేటాయింపులు చేయగా, ప్రస్తు్తతం అది 16.3 శాతానికి దిగొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పెట్టుబడులను తగ్గించుకుంది. మైనింగ్, పెస్టిసైడ్ స్టాక్స్ నుంచి వైదొలిగింది. టెలికం, నాన్ ఫర్నెస్ మెటల్ స్టాక్స్ పోర్ట్ ఫోలియోలో వచ్చి చేరాయి. లార్జ్‌క్యాప్‌లో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎల్అండ్టీ ఉండటం స్థిరమైన రాబడులకు తోడ్పడుతోంది. ఇటీవలి కాలంలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్, జీఐసీ ఆఫ్ ఇండియా, సన్‌టీవీ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టింది. టాప్హోల్డింగ్స్ స్టాక్ పేరు కేటాయింపుల శాతం హెచ్డీఎఫ్సీ 4.15 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3.96 గ్రాఫైట్ ఇండియా 3.76 ఎల్అండ్టీ 3.06 ఐటీసీ 2.74 ఐసీఐసీఐ బ్యాంకు 2.70 యాక్సిస్ బ్యాంకు 2.69 ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ 2.53 టీసీఎస్ 2.51 కోటక్ బ్యాంకు 2.35 -
పెట్టుబడికి పెద్ద మొత్తం ఉంటే...
నా వయస్సు 22 సంవత్సరాలు. ఇటీవలే చిన్న ఉద్యోగంలో చేరాను. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తం పొదుపు చేద్దామనుకుంటున్నాను. ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమని, కొందరు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయమని మరికొందరు మిత్రులు చెబుతున్నారు. దీర్ఘకాలానికి ఈ రెండింటిలో ఏది మంచి రాబడులనిస్తుంది ? నన్ను పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సూచనలివ్వండి. - సుధీర్, హైదరాబాద్ దీర్ఘకాలిక సంపదను సృష్టించడానికి ఈక్విటీ ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)కంటే కూడా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనమని చెప్పవచ్చు. స్వల్పకాలానికి ఈక్విటీల్లో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఐదేళ్లు అంతకు మించిన దీర్ఘ కాలానికి మంచి రాబడులు వస్తాయి. పీపీఎఫ్‌కు ఉన్న ఒకే ఒక ఆకర్షణ. గ్యారంటీగా వచ్చే రిటర్న్‌లు. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ రాబడులు ఏమంత సంతృప్తికరంగా ఉండవని చెప్పవచ్చు. ఇక ఈఎల్ఎస్ఎస్ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. రెండేళ్ల క్రితం పది లక్షల బీమాకు గాను ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. 16 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ పాలసీకి ఏడాది ప్రీమియమ్ రూ.68వేలు. ఇప్పటివరకూ రెండేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ పాలసీని కొనసాగించడం కష్టంగా వుంది. ఇప్పుడు వైదొలిగితే ఎంత నష్టం వస్తుంది. - ప్రకాశ్, విశాఖపట్టణం బీమా కవర్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. తక్కువ ప్రీమియమ్‌కే ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. ఇక మదుపు విషయానికొస్తే, మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. మీరు పాలసీ తీసుకొని రెండేళ్లే అయినందున ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. ఈ తరహా పాలసీలను సరెండర్ చేస్తే తొలి మూడేళ్లలో ఎలాంటి డబ్బులు వెనక్కి రావు. మీరు ఇప్పటికే రెండేళ్ల ప్రీమియమ్ రూ.1,36,000 చెల్లించారు. ఈ డబ్బులు వెనక్కిరావు. నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే కొంతైనా డబ్బులు వెనక్కి వస్తాయనే ఉద్దేశంతో మరో ఏడాది కూడా ఆగితే, మీ నష్టాలు మరింతగా పెరుగుతాయే కానీ తగ్గవు. ఉదాహరణకు మీరు చెల్లించే ప్రీమియమ్ మూడేళ్లకు రూ.2,04,000 అవుతుంది. దీంట్లో మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియమ్‌ను మినహాయించుకొని మిగిలిన ప్రీమియమ్‌లో 30% గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ(జీఎస్వీ)గా రూ.40,800 మీకు చెల్లిస్తారు. అంటే మీకు నికరంగా రూ.1,63,200 నష్టపోతారన్నమాట. ఈ మధ్యే నాకు ఇద్దరు కవలలు పుట్టారు. వారి ఉన్నత విద్యాభ్యాసం కోసం మదుపు చేయాలనుకుంటున్నాను. కాగా రెండేళ్ల క్రితం మా నాన్నగారు రిటైరయ్యారు. నేను ఒక్కడినే కొడుకును కాబట్టి రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ నాకు ఇచ్చి మనవల చదువుల కోసం ఖర్చు చేయమని చెప్పారు. నా పిల్లల చదువు కోసం బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో పెద్ద మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? ఏది సరైన విధానం ? వివరించండి. - సంపత్, విజయవాడ పిల్లల ఉన్నత చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట ప్లాన్ (సిప్)విధానమే మేలు. అయితే పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు అందుబాటులో ఉంటే, వాటిని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ముందుగా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో బ్యాలెన్స్డ్ ఫండ్‌కు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయండి. సూపర్ టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్లైన్లో తీసుకోవచ్చా? కొన్ని మంచి ఆన్లైన్ సూపర్ టాప్ -అప్ మెడిక్లెయిమ్ పాలసీలను సూచిస్తారా ? - కుమార్, బెంగళూరు సూపర్ టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్లైన్లో తీసుకోవచ్చు. యునెటైడ్ ఇండియా సూపర్ టాప్ అప్ పాలసీ, రెలిగేర్ ఎన్హాన్స్ సూపర్-టాప్, అపోలో మ్యునిక్ ఆప్టిమా సూపర్...ఈ పాలసీలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆరోగ్య బీమా కవరేజ్‌ను మరింతగా పెంచుకోవడానికి సూపర్ టాప్-అప్ పాలసీలు మంచి మార్గం. ప్రీమియమ్‌లో స్వల్ప పెరుగుదలతోనే ఆరోగ్య బీమా రక్షణను మరింతగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.3 లక్షలకు ఆరోగ్య బీమా పాలసీ, రూ.10 లక్షలకు సూపర్ టాప్-అప్ పాలసీ కూడా తీసుకున్నాడనుకుందాం. అ వ్యక్తి రూ.5 లక్షలకు క్లెయిమ్ చేస్తే, రెగ్యులర్ ఆరోగ్య బీమా పాలసీ రూ. 3లక్షలు, సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా రూ. 2 లక్షలు చొప్పున చెల్లిస్తాయి. అయితే ఈ పాలసీలను తీసుకునేటప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను, పాలసీ బ్రోచర్‌ను క్షుణ్నంగా పరిశీలించడం మాత్రం మరచిపోవద్దు. మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ వంటి అంశాలను తప్పనిసరిగా గమనించండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఓకేనా?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌పై త్వరలో రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) ప్రభావం ఏ మేరకు ఉంటుంది? మూడేళ్ల లాక్-ఇన్-పీరియడ్ కొనసాగుతుందా? డీటీసీని పరిగణనలోకి తీసుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహమేనా? - రాజేంద్ర, విశాఖపట్నం డీటీసీ అమల్లోకి వస్తే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పన్ను-ఆదా చేసే మదుపు సాధనాలుగా పరిగణించలేం. ఈ ఫండ్స్‌కు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ కొనసాగవచ్చు. డీటీసీ అమల్లోకి వస్తే బహుశా ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా రావచ్చు. పైగా ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు వైదొలిగే అవకాశాలే అధికంగా ఉంటాయి. మొత్తం మీద ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌పై డీటీసీ ప్రతికూల ప్రభావమే చూపించే అవకాశాలున్నాయి. అయితే డీటీసీ కారణంగా ఈ ఫండ్ల పనితీరు మాత్రం ప్రభావితం కాకపోవచ్చు. దీర్ఘకాలం నుంచి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతుండడమే దీనికి కారణం. బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్ ఫండ్‌లో ఈ ఏడాది జనవరి నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? ఆపేయమంటారా? - రాధిక, విజయవాడ బిర్లా సన్‌లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ప్లస్... మంచి డివిడెండ్లు చెల్లిస్తున్న ఫండ్స్‌ల్లో ఒకటి. ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్న 6-7 ఉత్తమ ఫండ్స్‌లో ఇది ఒకటని చెప్పవచ్చు. గత ఐదేళ్ల నుంచే ఈ తరహా డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చాయి. పలువురి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో తప్పనిసరిగా ఉండే ఫండ్స్‌ల్లో ఒకటిగా డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఘనత సాధించాయి. అందుకని ఈ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌ల్లో ఎలాంటి సందేహాలు లేకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త. పదేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను సూచించండి? - రాజేశ్, కరీంనగర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కనుక మీరు తొలిసారిగా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. అయి తే అగ్రెసివ్‌గా ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో కాకుం డా కన్సర్వేటివ్‌గా ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం యూటీఐ బ్యాలెన్స్డ్, డీఎస్పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నా వయస్సు 31 సంవత్సరాలు. నేను 60 ఏళ్లకు రిటైరవుతాను. నెలకు రూ.8,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రతి ఏడాది 10 శాతం పెంచగలను. నేను రిటైరయ్యేటప్పటికి రూ.2.5 కోట్ల నిధి ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. ఏయే ఫం డ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారో తగిన సలహా ఇవ్వండి. - వినోద్ కుమార్, హైదరాబాద్ మీరు ఇన్వెస్ట్ చేసే కాలం అధికంగా ఉంది. పైగా ప్రతి ఏడాది మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని 10 శాతం పెంచుతామని అంటున్నారు కూడా. అందుకని మీ రిటైర్మెంట్ నిధి విషయమై మీరు అధికంగా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసినా సరే మీరు మీ లక్ష్యాన్ని సాధించగలరు. మీరు మీ ఇన్వెస్ట్మెం ట్స్‌ను బ్యాలెన్స్డ్ ఫండ్స్‌నుంచి మొదలు పెట్టండి. తొలి 2-3 ఏళ్లలో ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ప్రారంభిం చండి. ప్రతి ఏడాది మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్ పనితీరును మదింపు చేయడాన్ని మరచిపోకండి. నా వయస్సు 44 సంవత్సరాలు. రూ. కోటికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్ టర్మ్ లైఫ్ కవర్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ వార్షిక ప్రీమియమ్ రూ.34,000. కుటుంబంలో నేనొక్కడినే సంపాదనపరుడిని. నేను చెల్లించాల్సిన రుణాలేమీ లేవు. గృహ, వ్య క్తిగత, వాహన,తదితర రుణాలేమీ నేను తీసుకోలేదు. జీవిత బీమా అవసరాల కోసం నేను తీసుకున్న పాలసీ సరిపోతుందా ? తగిన సలహా ఇవ్వండి. - అజయ్, సికిందరాబాద్ మీ కుటుంబంలో మీరు ఒక్కరే సంపాదనపరులు కాబట్టి మీపై ఆధారపడిన వారికి రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకని మీరు తగిన బీమా కవర్ తీసుకోవడం తప్పనిసరి. మీరు లేనప్పుడు మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోవడానికి, పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నెరవేరేలా మీ జీవిత బీమా కవర్ ఉండాలి. ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని మీ నెలవారీ ఖర్చులు గణించండి. పిల్లల చదువు, వాళ్ల పెళ్లిళ్లు, మీ జీవిత భాగస్వామికి పెద్ద వయస్సులో అవసరమయ్యే వైద్య సేవలు తదితర ఖర్చులను కూడా లెక్కించి ఎంత జీవిత బీమా కవరేజ్ అవసరమో మదింపు చేయండి. దీనిని బట్టి ప్రస్తు తం మీరు తీసుకున్న బీమా కవరేజ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే బీమా కవర్ పెరిగేలా చూసుకోండి. ఇక మీరు తీసుకున్న పాలసీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐకేర్ టెర్మ్ ప్లాన్‌ను పరిశీలిస్తే, ఈ పాలసీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 94 శాతంగా ఉంది. అయితే ప్రీమియమ్ కొంచెం అధికంగా ఉందని చెప్పాలి. మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్‌ను మీరు పరిశీలించవచ్చు. ఈ ప్లాన్‌కు ప్రీమియమ్ తక్కువగా ఉంది. మీ వయస్సుకు రూ. కోటి బీమా కవర్‌కు మీరు చెల్లించాల్సిన ప్రీమియం రూ.17,300 (మీరు పొగతాగని వ్యక్తి అయితే) చెల్లించాల్సి ఉంటుంది. అదే పొగ తాగే అలవాటున్న వ్యక్తికి ప్రీమియం రూ.29,000గా ఉంటుంది. ఈ పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.63% ఉంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణం మంచిదే...
నా వయస్సు 30 సంవత్సరాలు. ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. నా జీతం రూ.70,000. ఏడాదికి 5 శాతం చొప్పున వేతన పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నాను. ఇటీవలనే .28 లక్షలకు గృహ రుణం తీసుకున్నాను. నెలకు రూ.29,000 చొప్పున ఈఎంఐ చెల్లిస్తున్నాను. ఈ గృహ రుణ కాలపరిమితి 30 సంవత్సరాలు. నాకు 60 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి ఈ రుణం తీరుతుంది. నా భార్య గృహిణి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు, మా నాన్నగారు నా దగ్గరే ఉంటారు. వీరంతా నాపై ఆధారపడి ఉన్నవాళ్లు. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మదుపు చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే 14 శాతం, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 8.5 శాతం చొప్పున రాబడులు వస్తాయని మిత్రులు చెబుతున్నారు. గృహ రుణం ముందుగానే తీర్చివేసి, ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయాలా? గృహ రుణం చెల్లిస్తూనే ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా ? పీపీఎఫ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సూచనలివ్వండి? - జీవన్ కుమార్, విశాఖపట్టణం గృహ రుణానికి సంబంధించి నెలవారీ సమాన వాయిదాలు(ఈఎంఐ)లు చెల్లించడంలో మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే, ఈ గృహ రుణం అసలులో కొంత మొత్తాన్ని తీర్చేయండి. మీరు సౌకర్యవంతంగా ఈఎంఐ చెల్లించగలిగిన స్థాయిలో గృహ రుణం అసలులో కొంత మొత్తాన్ని తీర్చేయండి. ఒకవేళ గృహరుణ ఈఎంఐలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే, ముందస్తు చెల్లింపులు విషయం మరచిపోండి. పన్ను ఆదా చేసే లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో మదుపు చేయడం ప్రారంభించండి. గృహ రుణం మంచి రుణం అని చెప్పవచ్చు. ఈ రుణం వల్ల ఒక ఆస్తి మన సొంతమవుతుంది. అంతేకాకుండా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. పర్సనల్ లోన్ తదితర ఇతర అన్సెక్యూర్డ్ రుణాలతో పోల్చితే వడ్డీరేట్లు తక్కువగానే ఉంటాయి. అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చే క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ మంచి రుణాలు కావు. ఒకవేళ ఇలాంటివి ఉంటే, అన్నింటికంటే ముందుగానే ఈ రుణాలను తీర్చేయాలి. వీటిమీద 20-30 శాతం వరకూ వడ్డీ కడుతూ, 7-15 శాతం వడ్డీ వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం సరైనది కాదు. మీ గృహ రుణం మొత్తం తీరిన తర్వాత ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన విధానం కాదు. చిన్న మొత్తాలతోనైనా, చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల చక్రవడ్డీ కారణంగా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా, త్వరగా సాధించగలుగుతారు. పన్ను ఆదా మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ను పరిశీలించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఇవే. ఈఎల్ఎస్ఎస్ లేదా ఇతర ఈక్విటీ సాధనాల్లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసేలా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. నేను రూ.8 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలను. ఒక సంవత్సరం తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున నాకు డబ్బులు అవసరమవుతాయి. వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. తగిన సూచనలివ్వండి. - సమున్నత, విశాఖపట్టణం మీరు వాస్తవదూరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏడాదికి 25 శాతం రాబడి వస్తేనే మీకు సంవత్సరం తర్వాత ఏడాదికి రూ.2 లక్షల చొప్పున పొందగలరు. ఈ తరహా రాబడులను ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థా ఆఫర్ చేయడం లేదు. నా వయస్సు 63 సంవత్సరాలు. గతంలో బ్యాంకులో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యి రూ.6 లక్షలు ఇటీవలనే నా చేతికొచ్చాయి. వీటిని బ్యాంకులో మళ్లీ రీఇన్వెస్ట్ చేయాలనుకోవడం లేదు. వీటిపై వచ్చే రాబడులు పన్నులు పోను చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ రూ.6 లక్షలను మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. కొంత రిస్క్ భరించగలను. ఏడాదికి 9 నుంచి 10 శాతం రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. ఇప్పటికే కొన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. - హఫీజ్, హైదరాబాద్ ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను రికమెండ్ చేయలేము. పన్నులు పోను తగిన రాబడులు రావాలంటే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పన్ను అంశాల పరంగా వీటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. అందుకని ఏడాది దాటిన తర్వాత వీటిని విక్రయిస్తే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల కాలానికి మించిన ఇన్వెస్ట్మెంట్ కోసం డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను, మంత్లీ ఇన్కమ్ ప్లాన్(ఎంఐపీ)లను పరిశీలించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకున్న డీమ్యాట్ అకౌంట్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - నర్మద, గుంటూరు మీ ట్రేడింగ్ అకౌంట్ మీ డీమ్యాట్ అకౌంట్లో అనుసంధానమై ఉంటే, మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు. అయితే పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతాం. ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోల్చితే బంగారం భిన్నమైనది. బాండ్లలలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వడ్డీ వస్తుంది. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్లు, బోనస్‌లు, ధర పెరగడం.. ఇలాంటి ప్రయోజనాలుంటాయి. కానీ బంగారం విలువ మాత్రం డిమాండ్, సరఫరా అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులున్నప్పటినుంచి పుత్తడి పెట్టుబడులు మంచి రాబడులనిచ్చాయి. గత ఐదేళ్లలో గోల్డ్ ఈటీఎఫ్‌లు చెప్పుకోదగ్గ స్థాయి రాబడులను ఇవ్వలేదు. గత ఐదేళ్లలో ఇవి 3 శాతం కంటే తక్కువ రాబడులనే ఇచ్చాయి. ఏడాది నుంచి -మూడేళ్ల కాలానికి కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు నష్టాలను కూడా ఇచ్చాయి. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై పునరాలోచన చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వంద శాతం ఈక్విటీ ఫండ్స్ ఉంటాయా?
వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) కంటే ఇవి అధిక రాబడులను ఇస్తాయా? - హాసిని, తిరుపతి చాలా ఈక్విటీ ఫండ్స్ తమ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా దాదాపు వంద శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌కు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు తేడా ఒక్కటే. ఈఎల్ఎస్ఎస్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. అందుకని ఈ ఫండ్ మేనేజర్ ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఈక్విటీల్లోనే మూడేళ్లపాటు ఉంచుతారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఆ లాకిన్ పీరియడ్ ఉండదు. ఇక రాబడుల విషయానికొస్తే, దీర్ఘకాలం క్రమం తప్పకుండా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. నేను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉన్నా యా? నేను డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - శివప్రసాద్, గుంటూరు డెట్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ) దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్లలాగానే ఉంటాయి. తేడా ఒక్కటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి గడువుకు ముందుగానే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఎఫ్‌ఎంపీలో అలా వీలు లేదు. కాకుంటే ఎఫ్ఎంపీలు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులనిస్తాయి. ఇక సేవింగ్స్ డిపాజిట్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం. నా వయస్సు 28 సంవత్సరాలు. పన్ను ఆదా చేసే ఉద్దేశంతో రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీనికి అదనంగా మరో 50 వేల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఈక్విటీల్లో మదుపు చేయమంటారా? లేక నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? వివరించండి. - ఆనంద్, హైదరాబాద్ 28 సంవత్సరాలున్న మీరు 30 ఏళ్లపాటు (మీరు రిటైరయ్యేంత వరకూ) మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందగలరు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఈక్విటీ కేటాయింపులు గరిష్టంగా 50 శాతం మాత్రమే ఉంటాయి. అదే ఈక్విటీ ఫండ్స్‌లో అయితే ఈక్విటీ కేటాయింపులు వంద శాతంగా ఉంటాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అదే ఎన్పీఎస్ వల్ల పన్ను ప్రయోజనాలున్నాయి. మీరు కనుక ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పన్ను బాధ్యత కొంత వరకూ తగ్గుతుంది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. నేను హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌లో గత కొంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. రాబడులు అం తంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? - పవన్, వరంగల్ హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గత 2,3 ఏళ్లుగా ఈ ఫండ్ పనితీరు బాగా లేకపోయినప్పటికీ, మరీ నిరాశౠజనకంగా లేదని చెప్పొచ్చు. మీరు ఓపిక పడితే మంచి రాబడులే పొందొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. నా వయస్సు 45 సంవత్సరాలు. నేను నెలకు రూ. 1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మీ అభిప్రాయం చెప్పండి ? - రామాంజనేయులు, విశాఖపట్టణం మీ వయస్సు 45 ఏళ్లు. కాబట్టి మీరు ఎన్పీఎస్ను ఎంచుకుంటే 13 ఏళ్ల పాటు ఆ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయెచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 40 శాతాన్ని యొన్యూటీగా కన్వర్ట్ చేస్తారు. మీరు తక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు పన్ను లాంటి బాదరబందీలేమీ ఉండవు. ఈ స్కీమ్ లో ఈక్విటీలకు కేటాయించేది గరిష్టంగా 50% మాత్రమే. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో 8-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఒక విధంగా మీకు ఇది పెన్షన్ ప్లాన్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇక మీరు రిటైరయ్యే 2-3 ఏళ్ల ముందు ఈ ఫండ్‌లో జమ అయిన మొత్తాన్ని ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లోకి మార్చుకోండి. -
ఈక్విటీలు యువజనులకేనా...?
మా నాన్నగారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా మార్గాల కోసం ఆయన చూస్తున్నారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పీఎస్‌యూ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - అనిరుధ్, హైదరాబాద్ పన్ను ఆదా చేయడం కోసం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదనే అపోహ చాలా ప్రబలంగా ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి కాబట్టి, ఇవి యువజనులకు మాత్రమే అనువైనవని, వృద్ధులకు తగినవి కావని చాలా మంది భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు స్వల్పకాలానికే రిస్క్ అని చెప్పవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి, లేదా అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. రిస్క్ తక్కువగా, రాబడులు ఎక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి స్వల్పమే. ఈఎల్ఎస్ఎస్ల్లో వచ్చే రాబడులపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే వచ్చే రాబడిపై పన్ను ఉంటుంది. అంతే కాకుండా మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)కూడా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో లిక్విడిటీ కూడా ఎక్కువ. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లు. కాగా, పన్ను ఆదా ఎఫ్‌డీల్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లలో లిక్విడిటీ ఏమాత్రం ఉండదు. వీటిని ముందుగా తీసుకోవడానికి లేదు. అంతేకాకుండా వీటిపై రుణం కూడా తీసుకునే వీలు లేదు. ఇతర ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లాగానే ఈఎల్ఎస్ఎస్లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఏడేళ్ల క్రితం నేను మూడు పన్ను ఆదా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఎలా విక్రయించాలి? - కృష్ణవేణి, నిజామాబాద్ సాధారణంగా పన్ను ఆదా ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈ పన్ను ఆదా ఫండ్స్‌లో ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఎప్పుడైనా మీరు వీటిని ఉపసంహరించుకోవచ్చు. వీటిని ఉపసంహరించుకోవడం చాలా సులువు. మీకు వచ్చే అకౌంట్ స్టేట్మెంట్ దిగువ భాగంలో ఉండే రిడంప్షన్ ఫారమ్‌ను పూర్తి చేసి, సంతకం పెట్టి సదరు ఫండ్ సంస్థకు గానీ, సంస్థ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి గానీ పంపించాలి. ఇలా పంపించిన మూడు రోజుల తర్వాత మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేస్తే మంచి రాబడులు పొందుతారని మీరు తరచుగా చెబుతుంటారు. ఎలా డైవర్సిఫై చేయాలి? - వికాస్, నెల్లూరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్న రకాలుగా డైవర్సిఫై చేసుకోవచ్చు. డైవర్సిఫైడ్ ఫండ్ల నుంచి ఏదో ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. విభిన్న రంగాలపై దృష్టిసారించిన ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, ఇన్వెస్ట్మెంట్ కాలం, మీరు భరించగలిగే రిస్క్... మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రిస్క్ తట్టుకోలేని వారైతే లార్జ్ అండ్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయగల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు రకాలైన విభిన్న రంగాల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. -
ఫండ్స్ కొనుగోళ్లకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలా?
నేను గత కొంతకాలంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. నేను ఈ స్కీమ్‌లోనే కొనసాగాలనుకుంటున్నాను. కానీ, డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆదా చేసే ఉద్దేశంతో డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మారదామనుకుంటున్నాను. ఇలా మారితే మరో మూడేళ్లు లాకిన్ పీరియడ్ వర్తిస్తుందా?- లావణ్య కుమార్, హైదరాబాద్ మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లో కొనసాగాలనుకుంటే, డివిడెండ్ ఆప్షన్ నుంచి గ్రోత్ ఆప్షన్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను మార్చుకుంటే, దానిని తాజా కేసుగానే భావిస్తారు. దీంతో మరో మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో గ్రోత్ ఆప్షన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ లాకిన్ పీరియడ్ బాదరబందీ ఏమీ ఉండదు. ఈఎల్ఎస్ఎస్ డివిడెండ్ ఆప్షన్లో ఎప్పుడు డివిడెండ్ చెల్లించాలనేది ఫండ్ మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో రెగ్యులర్ ఆప్షన్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నియంత్రణ మీకే ఉంటుంది. ఒక ఏడాది దాటిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక లాభాలుగా పరిగణించి ఎలాంటి పన్నులు విధించరు. ఫలితంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఎప్పుడు ఉపసంహరించుకోవాలనే విషయాన్నీ మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ఎంత కావాలనుకుంటే అంతే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేదా ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - మాళవిక, గుంటూరు ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమైనదని పలువురు నిపుణులు చెబుతుంటారు. దీర్ఘకాలానికి పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా, సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమని చాలా చాలా సందర్భాల్లో, ఎన్నోసార్లు నిరూపితమైనది. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో నిర్ణీత కాలానికి నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం(ఉదాహరణకు నెలకు రూ.10,000 చొప్పున ఒక పదేళ్లపాటు)గా సిప్ విధానాన్ని పేర్కొనవచ్చు. ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వాల్యూ) ఎంత ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా క్రమం తప్పకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా మార్కెట్లు పడిపోతున్నప్పుడు మనకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీంతో సగటు ధర తక్కువగా ఉండి, అధిక రాబడులు వస్తాయి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈక్విటీ మార్కెట్లు ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు అధిక ఎన్ఏవీకి యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో మార్కెట్లు పడిపోతే, మీ లాభాలు కూడా తగ్గిపోతాయి. ఒక వేళ మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే, సిప్ కంటే మంచి రాబడులే వస్తాయి. కానీ, దీనిని పట్టుకోవడం కష్టం. మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇంకా పడిపోతాయేమో అన్న సందేహం ఉంటుంది. మనం ఊహిం చని విధంగా మళ్లీ మార్కెట్లు పుంజు కుం టాయి. ఏడాది అంతకు మించిన దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ విధానమే ఉత్తమం. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు సాధారణ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే మార్కెట్లు పతన దశలో ఉన్నప్పుడు అసలు మార్కెట్ల జోలికే వెళ్లరు. కానీ సిప్ విధానంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌ను డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాలా? - శశి, విజయవాడ డీ మ్యాట్ అకౌంట్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచే నేరుగా మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత దరఖాస్తును నింపి, నిర్ణీత మొత్తానికి చెక్కును సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ నుంచి కూడా ఆన్లైన్లో ఫండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.