రైతు సహకార సంస్థలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ స్కీమ్
హైదరాబాద్: రైతు సహకార సంస్థలు/కంపెనీలకు మరింత సాధికారత క ల్పించే లక్ష్యంతో స్మాల్ ఫార్మర్స్ అగ్రి-బిజినెస్ కన్సార్షియం (ఎస్‌ఎఫ్‌ఏసీ) ప్రారంభించిన ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్స్ స్కీమ్ పట్ల అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కన్సార్షియం ప్రకటించింది. అర్హత కలిగిన సంస్థలు వాటి వాటాదారుల మూలధనానికి సమాన మొత్తంలో, 10 లక్షల పరిమితికి లోపు గ్రాంట్ పొందేందుకు ఈక్విటీ గ్రాంట్ ఫండ్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. ఆయా సంస్థల రుణ విశ్వసనీయతను పెంచడం, సభ్యులు తమ వాటా పెంచుకునేట్లు చేయడమే ఈక్విటీ గ్రాంట్ స్కీమ్ లక్ష్యం.