ఫైనాన్షియల్ బేసిక్స్..
క్రెడిట్ కార్డు కొట్టేశారా?
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ కార్డుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే స్థారుులో సమస్యలూ ఉంటారుు. అందుకే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలి. భద్రంగా కాపాడుకోవాలి. అంటే పొరపాటున మీ కార్డును ఎవరైనా దొంగలించారు అనుకోండి. అప్పుడు పరిస్థితేంటి? పోరుుంది కదా అని అలాగే ఉంటే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. కార్డు పోరుునప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం..
కార్డు పోరుున విషయం బ్యాంక్‌కు చెప్పండి
క్రెడిట్ కార్డు జారిపోరుున విషయం వెంటనే సంబంధిత బ్యాంక్/కార్డు జారీ సంస్థకు తెలియజేయండి. అప్పుడు బ్యాంక్ మీ కార్డును రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త కార్డును జారీ చేస్తుం ది. కార్డు పోరుున వెంటనే దాని పిన్ నంబర్‌ను మార్చడం మరచిపోవద్దు. ఏమాత్రం ఆలస్యం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
పోలీసులకు ఫిర్యాదు చేయండి
కార్డు దొంగతనం జరిగిన తర్వాత ఆ విషయాన్ని కేవలం బ్యాంకులకు మాత్రమే తెలియజేస్తే సరిపోదు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాలి. వారు కేసు నమోదు చేసుకుంటారు. ఈ కేసు సంబంధిత డాక్యుమెంట్లను భద్రం చేసుకోండి. క్రెడిట్ కార్డు పోరుున తర్వాత ఆ విషయాన్ని బ్యాంకులకు, పోలీసులకు చెప్పడం వల్ల ఆ అకౌంట్‌లో ఏవైనా అధిక మొత్తంలో లావాదేవీలు జరిగితే ఆ భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.