న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. వీటి విలువ రూ.1,200 కోట్లు. ఆమోదం తెలిపిన ప్రతిపాదనల్లో సనోఫి సింథల్యాబో ఇండియా, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్, ఐడియా సెల్యులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, బొహింగర్ ఇంగేల్హిమ్ ఇండియా, ఎ మెనారిని ఇండియా, రెసిఫార్మ్ పార్టిసిపేషన్ ఉన్నాయి. మొత్తం 17 ఎఫ్‌డీఐ ప్రతిపాదనల్లో ఆరింటికి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) 3 ప్రతిపాదనలను తిరస్కరించింది. ఏఎంపీ సోలార్ ఇండియా ప్రతిపాదన కూడా ఇందులో ఒకటి. మరో 6 సంస్థలనుంచి మరింత సమాచారాన్ని కోరింది. క్రెస్ట్ ప్రిమిడియా సొల్యూషన్స్, యు బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఇందులో ఉన్నాయి.
ఆరు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
Published Fri, Dec 30 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
Advertisement
Advertisement