సీసీఈఏకు అరబిందో ఎఫ్‌డీఐ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వం 11 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.1,076 కోట్లుగా ఉంది. ఇక ఫార్మా కంపెనీలు-గ్లెన్‌మార్క్, ఆరబిందో ఫార్మాల రూ.4,187 కోట్ల విలువైన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఆఫైర్స్(సీసీఈఏ)కు నివేదించింది. రూ.2,165 కోట్ల విదేశీ పెట్టుబడులను క్విబ్ ద్వారా సమీకరించాలన్న హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరబిందో ఫార్మా ప్రతిపాదను సీసీఈఏ పరిశీలనకు పంపించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 4న జరిగిన ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించింది.