
పెట్టుబడులకు ‘ఎఫ్‌డీఐ’ల బూస్ట్: ఫిచ్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను 15 రంగాలకు సంబంధించి సరళతరం చేయడం భారత్‌లో పెట్టుబడులకు ఊతం ఇచ్చే అంశంగా రేటింగ్ సంస్థ ఫిచ్ గురువారం పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటుకు దీర్ఘకాలంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.5 శాతంగా సంస్థ అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2016, 2017ల్లో ఈ రేటు 8.0%కి పెరుగుతుందన్నది తమ అంచనాగా వెల్లడించింది. డిస్కమ్‌ల ఆర్థిక పటిష్టతకు ఇటీవలి ప్యాకేజ్‌సహా వివిధ రంగాలు సంబంధించి ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు దేశంలో ఆర్థిక సంస్కరణల ధోరణి స్థిర రీతిన కొనసాగుతోందనడానికి నిదర్శనంగా ఫిచ్ అభిప్రాయపడింది.