
32 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారానికి దేశీయంగా డిమాండ్ తగ్గింది. 2016 ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో దిగుమతులు 32% క్షీణించాయి. 17.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.18 లక్షల కోట్లు) విలువైన బంగారం దిగుమతి జరిగింది. 2015 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 26.4 బిలియన్ డాలర్ల మేర (రూ.1.77 లక్షల కోట్లు) బంగారం దిగుమతులు జరిగాయి.
2016 ఒక్క డిసెంబర్ నెలలో బంగారం దిగుమతులు 48.49% క్షీణించి 1.96 బిలియన్ డాలర్ల (రూ.13,132 కోట్లు) విలువకు పరిమితం కావడం గమనార్హం. ధరలు తగ్గుదల, డీమోనిటైజేన్ కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు ఏప్రిల్–డిసెంబర్ కాలానికి 76.54 బిలియన్ డాలర్లకు తగ్గింది.