పరుగులు పెడుతున్న బంగారం
ముంబై : స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు మూడు నెలల గరిష్ట స్ధాయికి చేరాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు 245 రూపాయలు పెరిగి 27,425 రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి సైతం అదే పుంజుకుంది . ప్రస్తుతం కిలో వెండి 150 రూపాయలు దాకా పెరిగి 36,600 గా ఉంది. ఇండస్ట్రీయల్ వినియోగం మరింత పెరగుతుండటంతో వెండికి మరోసారి డిమాండ్ పెరిగిందని నిపుణులు చెపుతున్నారు. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 0.6శాతం పెరిగి కొత్త ట్రెండ్ సృష్టించింది ఔన్స్ బంగారం ధర 1159 డాలర్లుగా ఉంది.
మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కడపటి వార్తల ప్రకారం బంగారం ధరలు ఈ కిందివిధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ... రూ.28,570
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 25,780
కిలో వెండి ..........రూ. 36,700