ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..! | Gold rallies to fresh 4-week high with Fed, Brexit in focus By Investing... | Sakshi
Sakshi News home page

ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..!

Published Mon, Jun 27 2016 2:09 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..! - Sakshi

ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..!

బ్రెగ్జిట్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం
* ఫెడ్ వడ్డీరేటు పెంపు ఆలస్యమయ్యే ధోరణీ ‘ప్లస్’!
* క్రూడ్ ధరలు వెనకడుగు మరోకారణం

న్యూయార్క్/న్యూఢిల్లీ: ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా పసిడి వెలుగులు సమీప కాలంలో కొనసాగుతాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్‌లో ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర రూ.33,500 స్థాయికి చేరుతుందన్న అంచనా ఉండగా, అంతర్జాతీయ స్థాయికి సంబంధించి అంచనాలు చూస్తే  న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడయ్యే కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర 1,350 డాలర్లు, 1,475 డాలర్ల శ్రేణిలో తిరుగుతుంది.  కమోట్రెండ్జ్ రిసెర్ట్ డెరైక్టర్ జ్ఞాన్‌శేఖర్ త్యాగరాజన్  అంచనాల ప్రకారం...
   
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం.. ఫలితంగా అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనటం పసిడిలో పెట్టుబడుల పటిష్టతకు కారణం. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు వేర్వేరుగా  ఉద్దీపనలను ప్రకటించే అవకాశం.
అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.50% నుంచి ఇప్పట్లో పైకి పెంచదన్న అంచనా రెండవ కారణం. అమెరికా ఎన్నికల నేపథ్యమూ గమనార్హం.
ఇక మూడవ అంశానికి వస్తే- ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో క్రూడ్ ధరలు సైతం వెనకడుగు వేయడం.
అమెరికా డాలర్ మరింత బలహీన పడే అవకాశాలు ఉన్నాయని, ఇది పసిడికి మరింత మెరుపు తీసుకువస్తుందని ఏంజిల్ బ్రోకింగ్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ బిజినెస్ ఈక్విటీ రిసెర్చ్ విభాగం డెరైక్టర్ నవీన్ మాథూర్ అభిప్రాయపడ్డారు. దీనితో స్వల్ప కాలంలో రేటు దేశీయంగా రూ.31,500-32,500 శ్రేణిలో తిరిగే అవకాశం ఉందని అంచనావేశారు.
అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీథర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయా ఆర్థిక మందగమన అంశాలకు తోడు దేశంలో తగిన వర్షపాతమూ పసిడి డిమాండ్ బాగుండడానికి కారణమవుతుందని ఆయన అంచనా వేశారు.
 
వారంలో భారీ జంప్..
బ్రెగ్జిట్ వార్తల నేపథ్యంలో పసిడి నెమైక్స్‌లో సమీక్షా వారంలో పరుగు పెట్టింది. శుక్రవారం ఒక దశలో మార్చి 2014 గరిష్ట స్థాయికి ఔన్స్‌కు 1,359 డాలర్లకు ఎగసింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 డాలర్ల లాభంతో 1,319 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగానూ పసిడి ఇదే దూకుడు ప్రదర్శించింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్‌లో వారం వారీగా శుక్రవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 లాభంతో (3 శాతం) రూ.30,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం ఎగసి రూ.30.755 వద్దకు చేరింది. ఇక వెండి కూడా కేజీకి రూ.1,370 ఎగసి రూ. 42,930 వద్దకు భారీ జంప్ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement