ఎన్‌పీపీఏ అధికారాలకు కత్తెర | Government withdraws NPPA's power to cap non-essential drug prices | Sakshi
Sakshi News home page

ఎన్‌పీపీఏ అధికారాలకు కత్తెర

Published Wed, Sep 24 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ఎన్‌పీపీఏ అధికారాలకు కత్తెర

ఎన్‌పీపీఏ అధికారాలకు కత్తెర

 న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ(ఎన్‌పీపీఏ) అధికారాల్లో కేంద్రం కోత విధించింది. అత్యావసరంకాని ఔషధాల(నాన్-అసెన్షియల్) ధరలపై పరిమితి విధింపునకు సంబంధించి డ్రగ్‌ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ)-2013లోని నిబంధనలను కొన్నింటిని ఉపసంహరించుకుంది. ఎరువులు, రసాయనాల శాఖ అధీనంలో పనిచేస్తున్న ఫార్మాసూటికల్స్ విభాగం గత శుక్రవారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఎన్‌పీపీఓ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల 43 ఔషధాల ధరలపై పరిమితి విధింపుపై ఫార్మా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. డీపీసీఓ 2013లోని 19వ పేరాగ్రాఫ్ ప్రకారం హెచ్‌ఐవీ, గుండెసంబంధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కొన్ని నాన్-అసెన్షియల్ డ్రగ్స్‌పై పరిమితి విధించేందుకు ఈ ఏడాది మే 29న తాము మర్గదర్శకాలను ఇచ్చామని... దీన్ని తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఎన్‌పీపీఏ వెల్లడించింది. అయితే,  ఈ ఏడాది జూలై 10న 108 నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలపై పరిమితికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను ఇందులో ప్రస్తావించలేదు.

 ఫార్మా కంపెనీలకు సానుకూలం...
 ప్రభుత్వ ఆదేశాలమేరకు ఇకపై డీపీసీఓ ప్రకారం తమకు నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలను నియంత్రించే(పరిమితి విధింపు) అధికారం పోయినట్లేనని ఎన్‌పీపీఏ అధికారి ఒకరు వివరించారు. ప్రాణాధార ఔషధాల జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం)లో లేని కొన్ని డ్రగ్స్ ధరలను ప్రజా ప్రయోజనాలరీత్యా అసాధారణ పరిస్థితుల్లో నియంత్రించేందుకు డీపీసీఓ-2013లోని పేరాగ్రాఫ్ 19 ఎన్‌పీపీఏకి వీలు కల్పిస్తోంది. దీనిప్రకారమే కొన్ని ఔషధాల ధరలపై పరిమితులను ఇటీవలి కాలంలో ఎన్‌పీపీఏ విధించింది. డీపీసీఓ-2013 ప్రకారం ఎన్‌ఎల్‌ఈఎం జాబితాలో ఉన్న 348 డ్రగ్స్ ధరలను ఇప్పటికే కేంద్రం నియంత్రిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement