మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా!
న్యూఢిల్లీ: విదేశీయులు భారత్‌లో మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం సులభతరం కానున్నది. కేంద్ర ప్రభుత్వం భారత్‌కు వైద్య చికిత్సల కోసం వచ్చే పర్యాటకుల కోసం త్వరలో ఈ-వీసాలను జారీ చేయనున్నది. దేశంలో మెడికల్ టూరిజం మార్కెట్ 3 బిలియన్ డాలర్లు ఉంటుందని అం చనా. ఇది 2020 నాటికి 7-8 బిలియన్ డాలర్లకి చేరే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ-వీసాల జారీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌కు వైద్యం కోసం వచ్చే విదేశీయులకు త్వరలో ఈ-వీసాల జారీ ఉంటుందని హోం శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. విదేశాల నుంచి వైద్యం కోసం ఇండియాకు వచ్చిన వారు 2012, 2013, 2014లో వరుసగా 1.71 లక్షలు, 2.36 లక్షలు, 1.84 లక్షలుగా ఉంది.