న్యూఢిల్లీ: జీవీకే, జీఎంఆర్‌కు చెందిన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలు పలు విభాగాల్లో ప్రపంచంలోనే మేటి ఎయిర్‌పోర్టులుగా నిలిచి ‘ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డులను’ సొంతం చేసుకున్నాయి. ఇందులో జీవీకే గ్రూపు ఆధ్వర్యంలోని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (సీఎస్‌ఐఏ) ‘కస్టమర్ల అనుభవం’లో ప్రపంచంలోనే మేటి విమానాశ్రయంగా నిలిచింది. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసీఐ) నిర్వహించిన సర్వేలో లక్షల మంది ప్రయాణికులు ఈ విషయంలో సీఎస్‌ఐఏకు ఓటేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలిలో 176 దేశాలకు చెందిన 1,953 విమానాశ్రయాలకు సభ్యత్వం ఉంది.
4 కోట్లకు పైగా ప్రయాణికులు.. ఢిల్లీ నెంబర్ 1
జీఎంఆర్ గ్రూపు నిర్వహణలోని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐఏ) ఏటా 40 మిలియన్లకు పైగా ప్రయాణికుల రాకపోకలతో... ఈ విభాగంలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు సొంతం చేసుకున్నట్టు జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తెలిపింది.
కోటిన్నర లోపు ప్రయాణికులు... శంషాబాద్‌కే ఓటు
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రపంచ అత్యుత్తమ ఎయిర్‌పోర్టు అవార్డును దక్కించుకుంది. ఏటా ఐదు నుంచి పదిహేను మిలియన్ల ప్రయాణికుల విభాగంలో అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు లభించింది.
జీవీకే, జీఎంఆర్ విమానాశ్రయాలకు అవార్డులు
Published Wed, Mar 7 2018 1:05 AM | Last Updated on Wed, Mar 7 2018 1:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment