
ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా దేవరాజ రెడ్డి
ప్రెసిడెంట్‌గా మనోజ్ ఫాడ్నిస్ ఎంపిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్‌గా మనోజ్ ఫడ్నిస్, వైస్ ప్రెసిడెంట్‌గా ఎం.దేవరాజ రెడ్డి ఎంపికయ్యారు. 2015-16 సంవత్సరానికి గాను గవర్నింగ్ బాడీని సెంట్రల్ కౌన్సిల్ ఎన్నుకుంది. చార్టర్డ్ అకౌంటింగ్‌లో విశేష అనుభవం ఉన్న హైదరాబాద్‌కు చెందిన దేవరాజ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావ్వడంపై హైదరాబాద్ చాప్టర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఆయన వచ్చే ఏడాది ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఐసీఏఐలో కీలకమైన సెంట్రల్ కౌన్సిల్ మెంబర్‌గా దేవరాజ రెడ్డి 2010 నుంచి నిరంతరంగా కొనసాగుతున్నారు. 2010-13 కాలానికి ఒకసారి పనిచేసిన ఈయన 2013-16 కాలానికి కూడా సెంట్రల్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు.