9 కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టిన ఐఐటీ బాంబే
ముంబయి: ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే యూనివర్శిటీ 9 కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టింది. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఆ తొమ్మిది కంపెనీల వివరాలను గురువారం విడుదల చేసింది. ఇక మీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఆ తొమ్మిది కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు ఐఐటీ-బి అధికార ప్రతినిధి ఫల్గుణి బెనర్జీ నేహ తెలిపారు. అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... అనంతరం ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తుండటం, ఫేక్ కంపెనీలు వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. కాగా బ్లాక్లిస్ట్ కంపెనీల జాబితాను ఐఐటీ బాంబే విడుదల చేయటం ఇదే తొలిసారి. కాగా ఆయా కంపెనీల ప్రతిస్పందన బట్టి భవిష్యత్లో నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీల్లో జీపీఎస్కే, జాన్సన్ ఎలక్ట్రిక్ ఆఫ్ చైనా, పోర్టీ మెడికల్, పెప్పర్ టాప్, క్యాష్ కేస్ టెక్నాలజీస్ ఉన్నాయి. కాగా ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.