భారత్ - చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులు మన ఈక్విటీ మార్కెట్‌ను పెద్దగా ప్రభావితం చేయలేవని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో సైనిక వివాదం తలెత్తడంతో గత 3రోజుల నుంచి భారత స్టాక్ మార్కెట్ ఆటుపోట్లకు లోనవుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 1శాతం మేర నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దు వివాదాలు కంపెనీల ఆదాయాలపై ప్రతికూలతను చూపవని, అయితే స్టాక్‌మార్కెట్ ర్యాలీని కొద్దిరోజుల పాటు అడ్డుకోవచ్చని విశ్లేషకులంటున్నారు.
భారత్, చైనాలు పరస్పర వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయని, ఒకదేశంలో మరోదేశం చెప్పుకొదగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టాయని వారంటున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతలతో స్వల్పకాలం పాటు సప్లై అంతరాయాలు ఉండొచ్చని, అయితే స్టాక్ మార్కెట్‌పై తాత్కలిక ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులంటున్నారు.
‘‘స్టాక్ మార్కెట్‌కు భారత్-చైనాల మధ్య వివాదం అనే అంశం తాత్కాలిక సంఘటన. దేశవ్యాప్తంగా ఆయా రంగాలపై, ఈక్విటీ మార్కెట్‌పై చెప్పుకోగినతం ప్రభావం ఉండకపోవచ్చు.’’ అని సిస్టమాటిక్స్ గ్రూప్ డైరెక్టర్ ధనుంజయ్ సిన్హా తెలిపారు.
కోవిడ్-19 ప్రభావంతో చైనా నుంచి సప్లై అంతరాయాలు ఏర్పడటంతో జూన్ క్వార్టర్‌లో కంపెనీల ఆదాయాలు భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే కన్జూ‍్యమర్ డ్యూరబుల్స్‌పై కోవిడ్-19 ప్రభావం అధికంగా ఉంది.
దాదాపు 90శాతం కంప్రెషర్లను, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులలో అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని ఎమ్కే రీసెర్చ్ విశ్లేషకులు అంటున్నారు. సస్యసంరక్షణ ఔషధ, రసాయన కంపెనీలైన ధనుకా అగ్రిటెక్, రాలీస్, వినతి ఆర్గానిక్స్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్, అలాగే అటో రంగంలో టాటా మోటర్స్, మదర్ సుమి కంపెనీలు కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment