ఆర్థిక గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నా, స్టాక్ మార్కెట్లో మాత్రం సూచీలు రికార్డ్‌ల మోత మోగిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తొలి దశ ఒప్పందం కుదరడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లను సృష్టించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచి్చంది.
ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, 41,402 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 413 పాయింట్ల లాభంతో 41,352 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, 12,183 పాయింట్లను తాకి 111 పాయింట్ల లాభంతో 12,165 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. లోహ, టెలికం, ఫైనాన్షియల్, ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఈ ఏడాది కొత్త శిఖరాలకు చేరడం సెన్సెక్స్‌కు ఇరవయ్యోసారి కాగా, నిఫ్టీకి తొమ్మిదవసారి.
రోజంతా లాభాలే...
స్వల్ప లాభాలతో సెన్సెక్స్ ఆరంభమైంది. మెల్లమెల్లగా ఈ లాభాలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ సెన్సెక్స్, నిఫ్టీల జోరు పెరుగుతూనే ఉంది. నేడు (గురువారం) జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుండటం, జీఎస్‌టీ కనీస స్లాబ్‌ను 5% నుంచి 9 శాతానికి పెంచే అవకాశాలున్నాయన్న వార్తలు వచి్చనప్పటికీ, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గు చూపారు. ఇక ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, లాభాల స్వీకరణ కారణంగా యూరప్ మార్కెట్లు నష్టపోయాయి.
లోహ షేర్లు మెరుపులు...
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య పోరు కారణంగా చైనాలో వినియోగం, తయారీ రంగాలు మందగించాయి. దీంతో మన లోహ షేర్లు బాగా తగ్గాయి. ఇప్పుడు వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఈ దేశాల మధ్య ఒప్పందం కుదరడంతో లోహ షేర్లు జోరుగా పెరిగాయి. మరోవైపు చైనా నుంచే కాకుండా అంతర్జాతీయంగా డిమాండ్ పెరగగలదని, రానున్న మూడు నెలల్లో దేశీయంగా ఉక్కు ధరలు పెరుగుతాయని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేయడంతో ఉక్కు షేర్లు లాభపడ్డాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, సెయిల్, వేదాంత, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, హిందుస్తాన్ జింక్, నాల్కో షేర్లు 0.3%–6.5 శాతం వరకూ పెరిగాయి.
మరిన్ని విశేషాలు...
►యస్ బ్యాంక్ షేర్ 1.7% లాభంతో రూ. 47.60 వద్ద ముగిసింది. ఈ షేర్ పెరగడం ఇది వరుసగా నాలుగోరోజు. 4 రోజుల్లో 11 శాతం లాభపడింది.
►హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, అబాట్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌ఐఐటీ టెక్నలజీస్ తదితర షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి.
►కాగితం పరిశ్రమకు రానున్న బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఉంటాయన్న అంచనాలతో పేపర్ షేర్లు రెపరెపలాడాయి.
లాభాలు ఎందుకంటే..
►అమెరికా–చైనాల మధ్య వాణిజ్య డీల్
దాదాపు 17 నెలలుగా కొనసాగుతూ అంతర్జాతీయ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు శుభం కార్డ్ పడింది. తొలి దశ ఒప్పందం ఈ వారంలోనే కుదరడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించింది. ఈ డీల్ జరిగినప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం మేర పెరిగాయి.
బడ్జెట్ తాయిలాలు...
మందగమనంలో ఉన్న ఆరి్థక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి వినియోగం పెంపు,దేశంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే చర్యలను ఈ బడ్జెట్‌లో కేంద్రం తీసుకోగలదన్న అంచనాలు రోజు రోజుకు
మన మార్కెట్లోకి మరిన్ని విదేశీ నిధులు....
ఒక కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని 24 శాతం నుంచి పెంచే ప్రతిపాదన వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నదని సోమవారం నాడే ఆరి్థక మంత్రి నిర్ధారించారు. ఫలితంగా ఎమ్‌ఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌లో భారత వెయిటేజీ 8.9% నుంచి 9.6%కి పెరగనున్నది. ఫలితంగా 250 కోట్ల డాలర్ల విదేశీ నిధులు మన మార్కెట్లోకి వస్తాయని అంచనా. మరోవైపు బ్రెగ్జిట్ అనిశ్చితి తొలగడం, అమెరికా–చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదరడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఆర్‌బీఐ వ్యాఖ్యలు...
అవసరమైనప్పుడు వడ్డీ రేట్లను తగ్గించే ఆస్కారం ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయమివ్వడం సానుకూల ప్రభావం చూపించింది.
రూ.1.26 లక్షల కోట్లు
పెరిగిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.26 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ.1.26 లక్షల కోట్లు పెరిగి రూ. 154.28 లక్షల కోట్లకు చేరుకుంది.
ఫిబ్రవరి 1న ట్రేడింగ్
వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21) బడ్జెట్‌ను వచ్చే ఏడాది 2020, ఫిబ్రవరి 1న ఆరి్థక మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆరోజు శనివారం అయినప్పటికీ, స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని, ట్రేడింగ్ జరుగుతుందని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు వెల్లడించాయి.
బడ్జెట్‌పై అంచనాలతో..
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం చూపించింది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రానున్న బడ్జెట్‌లో కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోగలదన్న అంచనాలతో సెంటిమెంట్ మరింతగా మెరుగుపడింది.
–వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్
పైస్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి..
లాభాలు రానున్న సెషన్లలో కూడా కొనసాగవచ్చు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశమున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న, ఆకర్షణీయ ధరల్లో లభ్యమవుతున్న షేర్లను కొనుగోలు చేయాలి.
–అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment