స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్లో విహరించడం సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది ఓవర్ ద టాప్ యూజర్లు పాల్గొన్నారు. వీరిలో 87 శాతం మంది ఆన్‌లైన్ కంటెంట్‌ను తమ ఫోన్లలోనే వినియోగిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్య వీడియోలు, చిత్రా లను చూస్తున్నవారు 28 శాతం మంది ఉన్నారు. వీరు మూవీస్‌నే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఒరిజినల్, కొత్త కంటెంట్‌ను ఆస్వాదించేందుకే ఇష్టపడుతున్నారు.
ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!
Published Fri, Sep 6 2019 7:41 AM | Last Updated on Fri, Sep 6 2019 7:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment