అందుబాటులోకి ఐటీఆర్‌-1 ఫామ్‌ | ITR-1 Form For AY 18-19 Now Available For e-filing | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి ఐటీఆర్‌-1 ఫామ్‌

Published Tue, Apr 17 2018 6:20 PM | Last Updated on Tue, Apr 17 2018 6:20 PM

ITR-1 Form For AY 18-19 Now Available For e-filing - Sakshi

న్యూఢిల్లీ : పన్ను చెల్లించే శాలరీ క్లాస్‌ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తాజా ఐటీఆర్‌-1 దరఖాస్తు ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సింగిల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్ను(ఐటీఆర్‌) దరఖాస్తును ఏప్రిల్‌ 5న సీబీడీటీ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఆదాయపు పన్ను శాఖ తన వెబ్‌సైట్‌ https://www.incometaxindiaefiling.gov.inలో పొందుపరిచింది. మిగతా ఐటీఆర్‌ దరఖాస్తులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు అధికారి పేర్కొన్నారు.  

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త ఐటీఆర్‌ దరఖాస్తులు శాలరీ క్లాస్‌ ప్రజలకు తప్పనిసరి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఏడు ఐటీఆర్‌ దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌గా ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేటగిరీల పన్నుచెల్లింపు దారులకు దీని నుంచి మినహాయింపు ఉంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల మంది శాలరీ క్లాస్‌ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌-1ను ఫైల్‌ చేశారు. ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి తుది గడువు జూలై 31గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement