సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగం, ప్రభుత్వం మధ్య సంధానకర్తగా పనిచేస్తున్న జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరెడ్కో) తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ ఆర్ చలపతి రావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.
స్థిరాస్తి రంగంలోని క్షేత్ర స్థాయిలోని సమస్యల్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను మంత్రిత్వ శాఖలను నరెడ్కోలో చీఫ్ ప్యాట్రన్స్‌గా నియమిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నరెడ్కో చీఫ్ ప్యాట్రన్‌గా గృహ మరియు పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్ ఉండాలని ఇటీవల ఆయన్ని కోరామని చెప్పారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 12న ఢిల్లీలో నరెడ్కో 12వ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం. 2022 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 18.7 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 43.7 మిలియన్ ఇళ్ల కొరత ఏర్పడుతుంది. వీరందరికి సొంతిల్లు కల్పించాలంటే సుమారుగా రూ.1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వంటి పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో నిధుల కొరత తీరుతుంది.
నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్?
Published Sat, Aug 23 2014 12:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement