వచ్చే రెండేళ్లలో మరిన్ని సంస్కరణలు: సీతారామన్
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్ల కాలంలో భారీ, వ్యవస్థాగత సంస్కరణలను తీసుకొచ్చామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సంస్కరణల తాలూకు ఫలితాలను ఒడిసి పట్టుకునేందుకు, అలాగే రానున్న రెండేళ్లలో మరిన్ని ఆర్థికపరమైన సంస్కరణలు చేపట్టనున్నట్టు ఆమె తెలియజేశారు. మోదీ సర్కారు మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి ఓ వార్తా సంస్థకు ఇంటర్వూ్య ఇచ్చారు. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, పన్నులు, ఏవియేషన్, వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి తాము తీసుకున్న చర్యల్ని గుర్తు చేశారు. పాలనలో ప్రతీ స్థాయిలో సంస్కరణలను చేపట్టామన్నారు. రానున్న నెలల్లో ఆర్థిక వృద్ధికి సంబంధించి కొత్త సంస్కరణలు ప్రవేశపెడతామని చెప్పారు.