మళ్లీ ముంచిన కొరియా: భారీ నష్టాలు
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లను మరోసారి
నార్త్ కొరియా ముంచింది. నార్త్ కొరియా హెచ్చరికలతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 32,169 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం తన కీలకమార్కు 10,100ను కోల్పోయి, 71.95 పాయింట్ల మేర నష్టపోతూ 10,049 వద్ద కొనసాగుతోంది. పసిఫిక్‌లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు 0.4 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7 శాతం చొప్పున డౌన్ అయ్యాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రాఫైట్ ఇండియా, జేపీ అసోసియేట్స్, పీటీసీ ఇండియా, మ్యాట్రిమోనీ.కామ్‌లు 4 శాతం వరకు నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 82 పైసలు నష్టపోయి 65కి పైన ట్రేడవుతోంది. బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్ మార్కెట్‌లో 216 రూపాయల నష్టంలో 29,558 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి.