ముందు.. వెనకా 5 ఎంపీ కెమెరాతో ఫోను! | microsoft lumia 535 comes with 5 mp front camera | Sakshi
Sakshi News home page

ముందు.. వెనకా 5 ఎంపీ కెమెరాతో ఫోను!

Published Wed, Nov 12 2014 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ముందు.. వెనకా 5 ఎంపీ కెమెరాతో ఫోను!

ముందు.. వెనకా 5 ఎంపీ కెమెరాతో ఫోను!

నోకియా అన్న పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ తన చవక స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. లూమియా 535 అనే ఈ మోడల్ ఫోను ఖరీదు సుమారు రూ. 8300 వరకు ఉంది. నోకియా కంపెనీని కొనేసిన మైక్రోసాఫ్ట్ తొలిసారిగా తన బ్రాండు పేరుతో ఫోను విడుదల చేసింది. ఇంతకుముందు కూడా నోకియా లూమియా పేరుతో కొన్ని ఫోన్లు విడుదల చేసింది. అందులో విండోస్ ఓఎస్ ఉండటం ప్రధాన లక్షణం.

ఇప్పుడు తాజాగా విడుదల చేసిన లూమియా 535లో వెనక కెమెరాతో పాటు ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్స్ ఇవ్వడం గమనార్హం. దీనివల్ల సెల్ఫీలు మరింత స్పష్టంగా వస్తాయి. ఇన్నాళ్లూ ఉన్న ఫోన్లలో ఫ్రంట్ కెమెరాలు 1, 1.5 మెగాపిక్సెల్స్ మాత్రమే ఉండేవి. ఇక ఇందులో 5 అంగుళాల స్క్రీన్ ఉంది. ఈనెలలోనే భారతదేశంలో కూడా లూమియా 535 మార్కెట్లోకి వస్తుంది. సియాన్, ఆకుపచ్చ, కాషాయ, తెలుపు, నలుపు, బూడిద రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఫోన్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే సైజు: 5 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ వైడ్ యాంగిల్
ప్రధాన కెమెరా: 5 ఎంపీ
ఫ్లాష్ రకం: ఎల్ఈడీ ఫ్లాష్
ఇంటర్నల్ స్టోరేజి: 8 జీబీ (మైక్రో ఎస్డీ కార్డుతో పెంచుకోవచ్చు)
ర్యామ్: 1 జిబి
ప్రాసెసర్ రకం: క్వాడ్ కోర్ 1.2 గిగాహెర్ట్జ్
గరిష్ఠ టాక్ టైం: 11 గంటలు
గరిష్ఠ స్టాండ్ బై టైం: 23 రోజులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement