టెక్ దిగ్గజాలకు సింగపూర్ షాకిస్తూనే ఉంది
సింగపూర్ డిప్యూటీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Published Sat, Jul 22 2017 7:47 PM | Last Updated on Tue, Aug 7 2018 4:24 PM
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలకు సింగపూర్ మరింత షాక్‌కు గురిచేస్తూ ఉంది. శనివారం ఆ దేశ డిప్యూటీ ప్రధానమంత్రి థర్మాన్ షణ్ముగరత్నం చేసిన వ్యాఖ్యలు ఈ కంపెనీలను మరింత సందిగ్థతలో పడేశాయి. తమదేశంలో కఠినతరం చేసిన వీసా నిబంధనలకు మద్దతు కోరిన ఆ దేశ డిప్యూటీ ప్రధాని, ఇప్పటికే తమ దేశంలో మూడువంతుల మంది విదేశీ ఉద్యోగులున్నారని చెప్పారు. తమ దేశంలోకి వచ్చే ఉద్యోగుల ప్రవాహాన్ని నియంత్రించడానికి ఎలాంటి ప్రణాళిక లేకుండా.. ఓపెన్ బోర్డరును కలిగిఉండటం బుద్ధిహీనతను సూచిస్తుందన్నారు. అన్ని దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీలు సింగపూర్‌లో తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలకు సింగపూర్ జారీచేస్తున్న వీసాలు, ఆ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను నిర్వహించడానికి మరింత కష్టసాధ్యంగా ఉన్నాయని తెలిసింది.
మొత్తం సింగపూర్‌లో పనిచేసే వారు 5.5 మిలియన్ల మంది ఉంటే, వారిలో 2 మిలియన్ల మంది విదేశీయులే. దీంతో తమ దేశంలోకి వచ్చే వర్క్‌ఫోర్స్‌ను నియంత్రించడానికి ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఓపెన్ బోర్డరు కలిగిఉండటం తెలివి తక్కువతనమని షణ్ముగరత్నం వ్యాఖ్యానించారు. ఒకవేళ తప్పుడు రాజకీయాలుంటే, తప్పుడు ఆర్థికవ్యవస్థలే ఉంటాయన్నారు. ఢిల్లీ ఎకనామిక్స్ కంక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అమెరికా తరహాలో సింగపూర్ కూడా భారత ఐటీ సంస్థల, ప్రొఫెషనల్స్ వీసాలపై ఆంక్షలు తెచ్చింది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం అంతకముందే స్పష్టంచేసింది. భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భారత్ పేర్కొంది. భారత్, సింగపూర్‌లు ఉచిత ట్రేడ్ అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నాయి. సింగపూర్ కూడా ఆసియన్ బ్లాక్‌లో సభ్యురాలు.
Advertisement
Advertisement