Indian IT companies
-
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
ఐటీ రంగం నెత్తిన మరో పిడుగు: టెకీల గుండెల్లో గుబులు
సంక్షోభంలో ఉన్న భారతీయ ఐటీ రంగానికి చెందిన తాజా నివేదిక ఒకటి సంచలనం రేపుతోంది. 2024 ఆర్థిక సంవత్సరం కూడా అతలాకుతలమేనని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్ విశ్లేషకులు బాంబు పేల్చారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్స్ డీల్స్ మెరుగుపడే అవకాశం ఉందని భావించారు. ఇటీవలి తమ పరిశీలనలో భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదంటూ నిరాశను ప్రకటించారు. దీంతో ఐటీపై తమ నెగటివ్ ధోరణిని కొనసాగిస్తామని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా తాజా నోట్లో తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉండ బోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, గైడెన్స్‌ను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని జేపీ మోర్గాన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ని "వాష్అవుట్"గా ఇన్వెస్టర్లు పేర్కొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ 2025 వ్యూహంపై దృష్టి పెట్టాలని వారు భావిస్తారన్నారు. (స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!) వివిధ పరిశ్రమల ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో ఎలాంటి ఆశావమదృక్పథం కనపించలేదన్నారు డిమాండ్ ఇంకా పుంజుకోనందున్న ఐటీ పరిశ్రమపై తమ దృక్పథం బేరిష్‌గా ఉంది. మొత్తం పరిస్థితి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గాలేదని వెల్లడించారు. అలాగే దీర్ఘకాలం అధిక వడ్డీరేట్లు కొనసాగితే ఆర్థిక వృద్ధి మందమనం భయాలతొ పరిస్థితి ప్రతికూలమని ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో ,హెచ్‌సిఎల్‌టెక్‌తో సహా అన్ని ప్రధాన ఐటి సంస్థలు గతంలోనే హెచ్చరించాయి, ఎక్కువ యుఎస్ బేస్డ్ క్లయింట్లు కావడంతో తమ ఐటి వ్యయాన్ని తగ్గించడం, కాంట్రాక్టులను కూడా రద్దు లేదా ఆలస్య మవుతున్నాయని తెలిపాయి. ( క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు FY24 ఒక వాష్అవుట్ అని భావించారనీ, రీబౌండ్ ఆశలతో FY25కి దృష్టి మరల్చారని విశ్లేషకులు చెప్పారు. అలాగే గత మూడు నెలల్లో బ్లూ-చిప్ నిఫ్టీ 50, నిఫ్టీ IT ఇండెక్స్‌ను అధిగమించిందనికూడా వివరించారు. వచ్చే వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ తమ ఫలితాలను ప్రకటనుంచ నున్నారు. ఈసమయంలో జేపీ మోర్గన్ నివేదిక కీలకంగా మారింది. అంతేకాదు త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఎదురుచూస్తున్న టెకీలకు నిరాశే ఎదురైంది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) కాగా ఇప్పటికే భారత్ సహా, దిగ్గజ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఆదాయాలు క్షీణించాయి. ఫలితంగా ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడి పోయాయి. ప్రాజెక్టులు లేక బెంచ్ మీద ఉద్యోగులను చాలామందిని ఇంటికి పంపించేశాయి. ఆన్‌బోర్డింగ్ జాప్యంతోపాటు, క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దెబ్బ పడింది. ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. (ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్) -
ఆస్ట్రేలియాలో భారత్ ఐటీ సంస్థల పన్ను భారంపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్– ఆస్ట్రేలియాల వాణిజ్య మంత్రుల మధ్య వచ్చే నెలలో జరిగే కీలక సమావేశంలో భారతీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను లేవనెత్తనున్నట్లు ఇక్కడ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిజానికి రెండు దేశాలూ 1991లో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (డీటీఏఏ)పై సంతకం చేశాయి. 2013లో ఈ ఒప్పందంలో కాలానుగుణ మార్పులూ జరిగాయి. కాగా, ఆస్ట్రేలియాలో సాంకేతిక సేవలను అందించే భారతీయ సంస్థల ఆఫ్‌షోర్ ఆదాయంపై పన్ను విధింపును కూడా డీటీఏఏ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ పన్ను విధింపును నిలిపివేయడానికి డీటీఏఏ కింద నిబంధనలను త్వరగా సవరించాలని ఆస్ట్రేలియాను భారత్ కోరుతోంది. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ సెప్టెంబరు చివర్లో జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ సమావేశంలో పాల్గొనడానికిగాను భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత్ డీటీఏఏ నిబంధనల సమస్యను లేవనెత్తుతుందని అధికారి తెలిపారు. -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
వీసాలు భారీగా తగ్గించేశాయ్!
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకున్నా... దేశీయ ఐటీ రంగంపై భారీ ఎత్తున్న ప్రభావం పడకుండా ఉండేందుకు దేశీయ కంపెనీలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆఫర్ చేసే హెచ్-1బీ వీసాలను భారీగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని నాస్కామ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, అధ్యక్షుడు డెబ్జాణి ఘోష్‌లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశీయ ఐటీ కంపెనీలు మొత్తం హెచ్-1బీ వీసాల్లో 12 శాతం కంటే తక్కువగా తీసుకున్నాయని తెలిపారు. ప్రతేడాది 65 వేల వీసాలు అందుబాటులో ఉంటే, ఈ ఏడాది దేశీయ కంపెనీలు 8500 కంటే తక్కువగా తీసుకున్నాయని చెప్పారు. గత రెండేళ్లలో వీసాలు 43 శాతం మేర కిందకి పడిపోయినట్టు పేర్కొన్నారు. బిజినెస్ మోడల్స్‌లో మార్పులు సంభవిస్తున్న తరుణంలో ఇది అతిపెద్ద పరివర్తనగా ఘోష్ అభివర్ణించారు. ప్రతి ఒక్క దేశీయ ఐటీ కంపెనీ స్థానికులనే ఎక్కువగా నియమించుకునేందుకు చూస్తుందని ప్రేమ్‌జీ తెలిపారు. క్రమానుగతంగా స్థానికతను పెంచుతున్నట్టు చెప్పారు. హెచ్-1బీ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా టాప్ అమెరికా దిగ్గజాలే ఉన్నాయని, వారు భారత్ నుంచే ఎక్కువగా నియామకాలు చేపట్టారని చెప్పారు. దీని గల కారణం వారికి ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలని ఘోష్ చెప్పారు. హెచ్-1బీ వీసాలు ఎక్కువగా భారత్‌కే వస్తున్నాయని, ఈ ఉద్యోగులను ఎక్కువగా అమెరికా కంపెనీలే నియమించుకుంటున్నాయని పునరుద్ఘాటించారు. నేడు ప్రపంచంలో పెద్ద మొత్తంలో నైపుణ్యవంతుల కొరత ఏర్పడిందని, ఈ క్రమంలో ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తాము నాయకత్వ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసినట్టు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్ కింద ఐటీలో ఉద్యోగం చేస్తున్న 20 లక్షల మందికి రీస్కిల్ ప్రొగ్రామ్ చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కలిసి పచిచేస్తున్నట్టు చెప్పారు. లేఆఫ్స్‌పై స్పందించిన ఘోష్, కొత్త ఉద్యోగాలు సృష్టించడానికే నాస్కామ్ దృష్టిసారించిందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాలకు సన్నద్దమయ్యేలా ప్రజలను తయారుచేస్తున్నామన్నారు. రాబోతున్న 9 కొత్త టెక్నాలజీస్‌తో ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగనుందని, ఉద్యోగాల సృష్టిపై వాటి ప్రభావం ఎంత, వాటిని ఎలా ఎదుర్కొనాలి అనే అన్ని అంశాలను నాస్కామ్ గుర్తించినట్టు చెప్పారు. -
హెచ్1బీ మరింత కఠినం
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్ పార్టీ వర్క్ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్–1బీ వీసాదారు వర్క్ కాంట్రాక్ట్ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది. భారతీయ కంపెనీల తరఫున హెచ్–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్ పార్టీ వర్క్సైట్లు’ అంటారు. పని ఉన్నంత కాలానికే.. అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది. యజమాని–ఉద్యోగి బంధం కొనసాగించాలి ఈ పాలసీ ప్రకారం ‘థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఉద్యోగి పనిచేస్తున్నంతకాలం చట్టబద్ధమైన యజమాని–ఉద్యోగి సంబంధం కొనసాగేలా కంపెనీ చూసుకోవాలి. అలాగే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యమున్న వృత్తిలోనే పనిచేస్తాడని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగి చేయాల్సిన ప్రత్యేకమైన పని.. ఎంత కాలం పనిచేస్తాడు.. అందుకు సరిపడా నైపుణ్యం ఉందా? మొదలైన వివరాల్ని వీసా దరఖాస్తు సమయంలోనే కంపెనీలు వెల్లడించాలి. హెచ్–1బీ వీసాను గరిష్టంగా మూడేళ్ల వరకూ జారీచేయవచ్చని, అయితే ఆ నిర్ణయం తన విచక్షాణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని, అయితే దరఖాస్తు సమయంలో కంపెనీ పేర్కొన్న కాలానికే వీసా జారీ చేస్తామని యూఎస్సీఐఎస్ తెలిపింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీ.. యజమాని–ఉద్యోగి సంబంధాన్ని తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీసా పొడిగింపునకు తాజా నిబంధనలే హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేస్తే తాజా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని యూఎస్సీఐఎస్ తెలిపింది. ‘తాము సూచించిన నిబంధనల్ని పాటించకపోయినా.. నియమాలకు అనుగుణంగా వీసా పిటిషన్ లేకపోయినా తగిన చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కొన్నిసార్లు అమెరికన్ కంపెనీలు ఉద్యోగితో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేసుకుంటాయి. ఆ సమయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఎలాంటి పని ఉండదు. బెంచ్ పిరియడ్‌గా పేర్కొనే ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. అయితే అలా చేయడం చట్ట విరుద్ధమని, వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. భారతీయ కంపెనీలకు ఇబ్బందే.. తాజా నిబంధనల నేపథ్యంలో హెచ్–1బీ ఉద్యోగుల్ని అమెరికాకు పంపే కంపెనీలు వీసా దరఖాస్తులు సమర్పించేందుకు మరింత ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తు లేఖతో పాటు.. ఉద్యోగికి కేటాయించే పని వివరాలు, ఆ పని చేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం, విద్యార్హతలు, పని ఎంతకాలం ఉంటుంది, వేతనం, పనిగంటలు, ఇతర ప్రయోజనాల్ని జతపరచాలి. -
హెచ్-1బీపై కొత్త బిల్లు : భారతీయులకు ముప్పే!
బెంగళూరు : వార్షికంగా హెచ్-1బీ వీసాల కోటాను పెంచాలంటూ ఇద్దరు రిపబ్లికన్లు ఓ కొత్త బిల్లును అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు అమెరికన్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటివి మద్దతిచ్చాయి కూడా. అయితే అమెరికన్ దిగ్గజాలు సపోర్టు ఇచ్చిన ఈ బిల్లు భారతీయ ఐటీ కంపెనీలకు, భారత ఐటీ నిపుణులకు ఉపయోగకరమా? అంటే. అలాంటిదేమీ లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ ప్రవేశపెట్టిన ''ది ఇమ్మిగ్రేషన్ ఇన్నోవేషన్ యాక్ట్-2018''లో హెచ్-1బీ వీసాల కోటాను ఏడాదికి 65వేల నుంచి 85వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో పాటు ఈ కొత్త బిల్లు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్‌లో సంస్కరణలు కోరుతోంది. వీసా ఫీజులను పెంచి, ఆ నిధులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ ఎడ్యుకేషన్ శిక్షణకు వాడాలంటూ ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు కనుక పాస్ అయితే, దేశీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేతనం, మెదడుపై పనిభారాన్ని పెంచి, ముప్పు తెచ్చుస్తుందని పేర్కొంటున్నారు. సాధారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు హెచ్-1బీ వీసాలతో లబ్ది పొందుతూ ఉంటాయని, కాబట్టి వారు మద్దతు ఇవ్వడం సాధారణమని చెప్పారు. అదే కనీసం వేతనం లక్ష డాలర్లకు పెంచితే, ఈ కంపెనీలు ప్రతిభావంతులను ఆకర్షించుకుంటాయని బెంగళూరుకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థల రిక్రూటర్ హెడ్ హంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో క్రిష్ లక్ష్మికాంత్ తెలిపారు. కానీ కనీస వేతనం పెంపుతో, దేశీయ ఐటీ కంపెనీలు టీసీఎస్, విప్రోల నుంచి అమెరికాకు వెళ్లే వారు తగ్గిపోతారని పేర్కొన్నారు. కంపెనీలు అక్కడే నియామకాలు చేపడతాయని చెప్పారు. దీంతో ఈ బిల్లు భారత్‌కు ఎంతమాత్రం మంచిది కాదని తెలిపారు. -
అక్కడ మనవాళ్లు లక్ష ఉద్యోగాలిచ్చారు..
వాషింగ్టన్: అమెరికాలో భారత కంపెనీలు 1800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో లక్షకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించారు. అమెరికా భూభాగంలో భారతీయ మూలాలు పేరిట వెల్లడైన నివేదిక ప్రకారం అమెరికాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఆర్అండ్డీ పరిశోధనలపై కూడా భారత కంపెనీలు భారీ మొత్తం వెచ్చించాయి. అమెరికాలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 100 భారత కంపెనీలు లక్షా13వేల423 మందికి ఉద్యోగాలు సమకూర్చాయి. భారత కంపెనీలు ప్రధానంగా న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, జార్జియా రాష్ర్టాల్లో అత్యధికంగా ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. భారత కంపెనీల్లో 87 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో స్ధానిక అమెరికన్లకే అధికంగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత ఐటీ పరిశ్రమ, ప్రొఫెషనల్స్ ఇతోథికంగా తోడ్పడుతున్నారని అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా అన్నారు. దశాబ్ధాలుగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులతో పాటు స్ధానికులకు ఉపాధి అవకాశాలు సమకూరుస్తున్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారం మరింత బలపడుతుందని యూఎస్ సెనేటర్ క్రిస్ వాన్ హెలెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
టెక్ దిగ్గజాలకు సింగపూర్ షాకిస్తూనే ఉంది
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో కంపెనీలకు సింగపూర్ మరింత షాక్‌కు గురిచేస్తూ ఉంది. శనివారం ఆ దేశ డిప్యూటీ ప్రధానమంత్రి థర్మాన్ షణ్ముగరత్నం చేసిన వ్యాఖ్యలు ఈ కంపెనీలను మరింత సందిగ్థతలో పడేశాయి. తమదేశంలో కఠినతరం చేసిన వీసా నిబంధనలకు మద్దతు కోరిన ఆ దేశ డిప్యూటీ ప్రధాని, ఇప్పటికే తమ దేశంలో మూడువంతుల మంది విదేశీ ఉద్యోగులున్నారని చెప్పారు. తమ దేశంలోకి వచ్చే ఉద్యోగుల ప్రవాహాన్ని నియంత్రించడానికి ఎలాంటి ప్రణాళిక లేకుండా.. ఓపెన్ బోర్డరును కలిగిఉండటం బుద్ధిహీనతను సూచిస్తుందన్నారు. అన్ని దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీలు సింగపూర్‌లో తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలకు సింగపూర్ జారీచేస్తున్న వీసాలు, ఆ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను నిర్వహించడానికి మరింత కష్టసాధ్యంగా ఉన్నాయని తెలిసింది. మొత్తం సింగపూర్‌లో పనిచేసే వారు 5.5 మిలియన్ల మంది ఉంటే, వారిలో 2 మిలియన్ల మంది విదేశీయులే. దీంతో తమ దేశంలోకి వచ్చే వర్క్‌ఫోర్స్‌ను నియంత్రించడానికి ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఓపెన్ బోర్డరు కలిగిఉండటం తెలివి తక్కువతనమని షణ్ముగరత్నం వ్యాఖ్యానించారు. ఒకవేళ తప్పుడు రాజకీయాలుంటే, తప్పుడు ఆర్థికవ్యవస్థలే ఉంటాయన్నారు. ఢిల్లీ ఎకనామిక్స్ కంక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అమెరికా తరహాలో సింగపూర్ కూడా భారత ఐటీ సంస్థల, ప్రొఫెషనల్స్ వీసాలపై ఆంక్షలు తెచ్చింది. తమ దేశంలో ఉన్న భారత ఐటీ కంపెనీలు స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం అంతకముందే స్పష్టంచేసింది. భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు జారీ చేసే వీసాలను గణనీయంగా తగ్గించింది. అయితే, ఇది వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని భారత్ పేర్కొంది. భారత్, సింగపూర్లు ఉచిత ట్రేడ్ అగ్రిమెంట్‌ను అమలు చేస్తున్నాయి. సింగపూర్ కూడా ఆసియన్ బ్లాక్‌లో సభ్యురాలు. -
టెకీలకు మరో హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన సంగతి తెలిసిందే. ఆటోమేషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీస్ పెనుముప్పుగా విజృంభిస్తుండటంతో కంపెనీలు ఉద్యోగులపై భారీగానే వేటు వేస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే దానిపైన గ్యారెంటీ లేదు. ఈ సవాళ్లు భారత్ కు అతిపెద్ద సవాల్ గా ఉన్నాయని, దేశీయ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను రీ-ట్రైన్ చేయడం చాలా కష్టతరమని హెచ్చరికలు వస్తున్నాయి. 1.5 మిలియన్ మందిని లేదా ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ లో సగం మందిని రీ-ట్రైన్ చేయాల్సినవసరం ఉందని ఇటీవల ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. కానీ ప్రస్తుతం నాస్కామ్, కన్సల్టింగ్ సంస్థ క్యాప్‌జెమినీతో కలిసి చేసిన అంచనాల్లో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త స్కిల్-సెట్ లలో మధ్య, సీనియర్ స్థాయి దేశీయ ఐటీ కార్మికులు ఇమడలేరని తెలిపాయి. దీంతో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో కోత ప్రభావం అధికంగా ఉంటుందని తాజాగా హెచ్చరించాయి. తాను నిరాశాపూరిత విషయాన్ని చెప్పడం లేదని, కానీ ఇది ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని క్యాప్‌జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. 60-65 శాతం మంది శిక్షణ పొందలేరని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకున్న వారేనని తెలిపారు. దీంతో వారు అత్యధికంగా నిరుద్యోగులుగా మారే అవకాశముందని చెప్పారు. ఐటీ కంపెనీలు కూడా మధ్యస్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే బదులు ఎక్కువ ప్రతిభావంతులనే తమ కంపెనీలో ఉంచుకోవడానికి మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు. మధ్యస్థాయి ఉద్యోగులు కొత్త స్కిల్-సెట్లలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వారు ఉద్యోగాల కోత బారిన పడతారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ స్థాయి స్టాఫ్ కు లేదా కార్మికులకు తేలికగా కంపెనీ రీట్రైన్ చేస్తాయని చెప్పాయి. -
ట్రంప్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి
బెంగళూరు: యుఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంపై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని వ్యాఖ్యానించారు. దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు శనివారం వరుస ట్వీట్లలో ఐటీ కంపెనీల సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఐటీ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిగ్ డేటా తదితర అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్ చేశారు. బెంగళూరులో దేశంలోని ఐటి రంగ ప్రతినిధులతో మాట్లాడిన కేంద్రమంత్రి భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు. బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో భారతీయ ఐటి కంపెనీలు ప్రపంచాన్ని జయించాయి, ఇప్పుడు భారతదేశంవైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ‘డిజిటల్ ఇండియా’తో విస్తృత మార్కెట్ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలవైపు చూడాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. కాగా బై అమెరికా, హైర్ అమెరికా అంటూ హెచ్-1బీ వీసాల విధానంపై కఠిన వైఖరి అనుసరిస్తున్న ట్రంప్ ఇటీవల కొత్త కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. తమ ఉద్యోగాలు తమకే కావాలన్న నినాదంతో వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. Opportunities in emerging areas of Artificial Intelligence, big data etc present a huge opportunity for Indian IT companies. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 Indian IT companies create jobs they do not steal jobs either in USA or in any other country. — Ravi Shankar Prasad (@rsprasad) April 22, 2017 -
అమెరికాలోని మనవారిపై మరో విద్వేషపు పడగ!
ఓహిలోని భారతీయుల విద్వేషపు వీడియో పెరిగిపోతున్న జాత్యాంహకారంపై ఎన్నారైల్లో గుబులు తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల దారుణమైన హత్యోదంతం కళ్లుముందు కదలాడుతుండగానే.. అమెరికాలో విద్వేషపు పడగలు విచ్చుకుంటున్నాయి. అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఎగజిమ్ముతున్న జాత్యాంహకారాన్ని నిలువెల్లా ఒంటబట్టించుకుంటున్న అమెరికన్లు.. తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని భారతీయులపై విద్వేషం పెంచుకుంటున్నారు. వారు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రవాస వ్యతిరేకుల వెబ్సైట్ అక్కడ ఉన్న మనవారిలో మరింత గుబులు రేపుతోంది. ఓహిలోని కొలంబస్ నగరంలో విశ్రాంతి తీసుకుంటున్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఈ వెబ్సైట్లో దర్శనమివ్వడమే కాదు.. మనవారికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నాయి. సేవ్అమెరికాఐటీజాబ్స్.కామ్ పేరిట ఉన్న ఈ సైట్లో.. ఓహిలోని ఓ పార్కులో కాలక్షేపం చేస్తున్న భారతీయుల కుటుంబాల వీడియోను పోస్ట్ చేశారు. సంపన్న భారతీయులు ఓహి పట్టణాల్లోకి చొరబడి.. స్థానిక అమెరికన్లను నిర్వాసితులను చేశారంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించారు. మార్చ్ 6నాటికి ఈ వీడియోను 40వేలకుపైగా మంది యూట్యూబ్‌లో చూశారు. వర్జినీయాకు చెందిన 66 ఏళ్ల కంప్యూటర్ ఇంజినీర్ స్టీవ్ పుషర్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. వాలీబాల్ ఆడుతున్న పెద్దలు, సైకిల్ తొక్కుతున్న చిన్న పిల్లల్ని వీడియోలో చూపిస్తూ.. 'ఇక్కడ ఎంతమంది విదేశీయులు ఉన్నారో చూస్తే నా దిమ్మ తిరిగిపోతోంది. ఈ ప్రాంతమంతా భారతీయులే ఉన్నారు. అమెరికన్ల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను వాళ్లు కొల్లగొట్టారు. భారతీయ జనాలు ఈ ప్రాంతాన్ని చెరపట్టారు. ఇది టేకోవర్ చేసుకోవడం లాంటిదే' అంటూ పుషర్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని వ్యంగ్యంగా 'మినీ ముంబై' అంటూ అభివర్ణించాడు. గత ఆగస్టులోనే అతను భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వీడియోను, ఓ పీడీఎఫ్ డాక్యుమెంట్‌ను కూడా పోస్టు చేశాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో విదేశీయులపై వ్యతిరేకత పెరిగిపోవడం, ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూచిభొట్ల హత్య జరిగిన నేపథ్యంలో ఈ విద్వేషపూరిత వెబ్సైట్లో ఉన్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఉండటం అక్కడున్న మనవారిలో మరింత గుబులురేపుతోంది. -
అక్కడ.. క్యాంపస్ నియామకాల జోరు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా వీసా విధానం మరింత బిగుసుకునే ప్రమాదం కనిపిస్తుండటంతో.. భారత ఐటీ కంపెనీలు అక్కడ క్యాంపస్ నియామకాల జోరు పెంచాయి. దాంతోపాటు అమెరికాలో ఉన్న చిన్న చిన్న ఐటీ కంపెనీలను కొనేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు చాలా కాలంగా ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు హెచ్1-బి వీసాలు ఇప్పించి వాళ్లను అమెరికా, ఇతర దేశాలలోని క్లయింట్ లొకేషన్లకు తాత్కాలికంగా పంపుతున్నాయి. 2005-14 సంవత్సరాల మధ్య కేవలం ఈ మూడు కంపెనీల నుంచే హెచ్1-బి వీసాలు తీసుకున్నవాళ్లు దాదాపు 86వేల మంది ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ అధికారం చేపడుతుండటంతో.. చాలా కాలం నుంచి ఆయన చెబుతున్న మాట ఐటీ కంపెనీల్లో గుబులు పుట్టిస్తోంది. చాలా కాలంగా వీసా విధానాన్ని విమర్శిస్తున్న సెనెటర్ జెఫ్ సెషన్స్‌ను అటార్నీ జనరల్‌గా కూడా ఆయన ఎంచుకున్నారు. దాంతో అమెరికా వీసాల విషయంలో రక్షణాత్మక విధానాన్ని అవలంబిస్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇక్కడివాళ్లు అనవసరంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో బాగా నిపుణులైన తాత్కాలిక ఉద్యోగుల గురించి భయపడుతున్నారని, ఎందుకంటే తాము కేవలం కొన్నాళ్ల పాటు మాత్రమే ఇక్కడ ఉండి పనిచేస్తామని ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్ రావు తెలిపారు. ఇప్పుడు హెచ్1-బి వీసాలను నియంత్రించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అమెరికాలోనే క్యాంపస్ నియామకాల ద్వారా స్థానికులను పెద్ద ఎత్తున తమ కంపెనీలలో చేర్చుకోవాలని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి. దానివల్ల అక్కడివారికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అవ్వడంతో పాటు.. తమ కంపెనీల విషయంలో కాస్త చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారనే ఆలోచన కూడా వస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న చిన్నపాటి ఐటీ కంపెనీలను కొనేయడానికి కూడా ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దానివల్ల తమ కంపెనీలలో పనిచేసే స్థానికుల సంఖ్య పెరుగుతుందని, పాతవాళ్లను పంపాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాయి. -
యూఎస్ వీసా ఫీజుల పెంపుపై జైట్లీ కోపం!
వాషింగ్టన్: అమెరికా వీసా ఫీజులను భారీగా పెంచడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వివక్ష చూపడమేనని, భారతీయ ఐటీ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆ దేశ వాణిజ్య ప్రాతినిధ్య రాయబారి మైఖేల్ ఫ్రోమన్‌తో సమావేశమై.. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వీసా ఫీజుల పెంపు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా అమెరికాలో పనిచేసే భారతీయులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన టోటలైజేషన్ ఒప్పందాన్ని త్వరగా పూర్తిచేయాల్సిన అవసరముందని తెలిపారు. అమెరికా హెచ్ 1బీ, ఎల్1 వీసా ఫీజులను పెంచడంపై జైట్లీ ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. 'వీసా ఫీజుల పెంపుపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ పెంపు వివక్షపూరితం. భారతీయ ఐటీ కంపెనీలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది' అని ఆయన పేర్కొన్నారు. హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలు భారతీయ ఐటీ కంపెనీల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే వీటిపై 2015లో అమెరికా చట్టసభ కాంగ్రెస్ 4,500 డాలర్ల ప్రత్యేక ఫీజు విధించింది. ఈ మొత్తాన్ని 9/11 హెల్త్‌కేర్ చట్టానికి కేటాయించనున్నట్టు తెలిపింది. ఈ ఫీజు నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తంచేస్తున్నది. -
అమెరికా వీసా.. మరింత కాస్ట్లీ గురూ!
అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్-1బి, ఎల్-1 వీసాలు మరింత భారం కానున్నాయి. 9/11 ఆరోగ్యసంరక్షణ చట్టం పేరుతో ఈ వీసాలపై ప్రత్యేకంగా 2 వేల డాలర్ల ఫీజు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1.35 లక్షలు) బాదాలని అక్కడివాళ్లు భావిస్తున్నారు. ఇంతకుముందు ప్రవేశపెట్టిన జేమ్స్ జడ్రోగా 9/11 హెల్త్ అండ్ కాంపన్సేషన్ చట్టంఓల భాగంగానే ఈ భారం మోపేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2006లో శ్వాసకోశ సమస్యలతో మరణించిన డిటెక్టివ్ పేరుమీద ఈ చట్టం వచ్చింది. అయితే.. ఈ చట్టం కాలపరిమితి అక్టోబర్ 1వ తేదీతో ముగిసింది. ఈ బిల్లును ఇక కాలపరిమితి అంటూ లేకుండా శాశ్వతంగా పొడిగించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీంట్లో భాగంగా హెచ్-1బి వీసాల మీద అదనంగా 2వేల డాలర్ల ఫీజు మోపాలని అడుగుతున్నారు. అయితే, బిల్లులోని అంశాలను జాగ్రత్తగా చూస్తే, ఈ భారం కేవలం భారతీయ ఐటీ కంపెనీల మీదే పడేలా ఉంది. భారతీయ ఐటీ కంపెనీలు 2010 నుంచి 2015 మధ్య ఏడాదికి సుమారు 470 -536 కోట్ల రూపాయలను వీసా ఫీజుగా చెల్లించినట్లు నాస్కామ్ చెబుతోంది. కంపెనీ ఉద్యోగులలో కనీసం సగం మంది హెచ్-1బి లేదా ఎల్-1 వీసాల మీద పనిచేస్తున్న కంపెనీలు ఈ ఫీజు చెల్లించాలని చట్టంలో ఉంది. దాదాపుగా ఇలాంటి పరిస్థితి కేవలం భారతీయ ఐటీ కంపెనీలకే ఉంఉటందని, అందువల్ల ఈ భారం మొత్తం మనవాళ్ల మీదే పడుతుందని అంటున్నారు.