
సాక్షి సిటీబ్యూరో: తమతో పాటు పలు చిన్న హోటళ్ల అకౌంట్స్ వ్యవహారంలో జొమాటో మోసాలకు పాల్పడుతోందని ముస్తఫా బిర్యానీ హౌస్ నిర్వాహహకుడు హసన్ బులుకీ అరోపించారు. సోమవారం గన్‌ఫౌండ్రీలోని మీడియా ప్లెస్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ ఫుడ్‌డెలివరీ సంస్థ జుమాటో హోటళ్లకు సమయానికి డబ్బులు చెల్లించకపోగా, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్నారు.. గత ఏడాది జుమాటోతో బిర్యానీ డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
గత డిసెంబర్‌లో తమకు ఎలాంటి సమాచారం అందించకుండా బిర్యానీ సరఫరాపై డిస్కౌంట్‌లు ప్రకటించారన్నారు. దీనిపై సంస్థ ప్రతినిధులు అడగ్గా సదరు మొత్తాన్ని తమ సంస్థ భరిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అయితే అందుకు భిన్నంగా తమకు రావాల్సిన డబ్బుల్లో నుంచి తగ్గించి ఇచ్చినట్లు తెలిపారు. హోటళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడు రోజుల్లో చెల్లించాల్సి డబ్బులను 15 రోజులైన చెల్లించడం లేదని అరోపించారు.