జోరుగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌ల్లోకి గత ఏడాది జోరుగా పెట్టుబడులు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడంతో 2016లో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.17 లక్షల కోట్ల మార్క్‌ను దాటేశాయి. కొత్త ఏడాది కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి జోరుగానే పెట్టుబడులు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపింది. నగదు నిల్వలు ఆర్థిక ఇన్వెస్ట్‌మెంట్స్‌గా రూపాంతరం చెందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.