
ఎన్‌ఎండీసీ సీఎండీగా నరేంద్ర కొఠారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్‌ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నరేంద్ర కొఠారి సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. సెయిల్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న కొఠారి ఈ పదవి చేపట్టకుముందు సెయిల్‌కి చెందిన ఇస్కో స్టీల్ ప్లాంట్ సీఈవోగా అక్టోబర్, 2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఉక్కు, బొగ్గు దిగుమతి రంగాల్లో మంచి అనుభవం ఉన్న కొఠారి సీఎండీగా ఏప్రిల్, 21న పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు ఎన్‌ఎండీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొఠారి నాయకత్వంలో ఎన్‌ఎండీసీ మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుందన్న ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు.