ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
Published Wed, May 17 2017 11:34 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
ముంబై : ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోత ఆందోళనతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా.. పలుకుకపోయినా.. టెకీలకు దడపుట్టిస్తూ రిపోర్టులు వస్తున్నాయి. వచ్చే క్వార్టర్లో మరో మల్టినేషనల్ ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా 5000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని ఇండస్ట్రీలో రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ రిపోర్టులన్నీ అవాస్తవమంటూ ఆ టెక్ దిగ్గజం స్పష్టంచేసింది '' ఈ రిపోర్టులు వాస్తవానికి తప్పు. రూమర్లు, ఊహాగానాలపై మరింత మాట్లాలనుకోవడం లేదు'' అని ఐబీఎం ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే త్రైమాసికంలో ఐబీఎం దాదాపు 5000 మంది భారత ఉద్యోగులను ఇంటికి పంపించేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ఆటోమేషనల్ ప్రభావంతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ లు కంపెనీలు కూడా ఉద్యోగాల కోతపై వార్నింగ్ ఇచ్చేశాయి. వీటి జాబితాలోనే ఐబీఎం కూడా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపాయి. ఇప్పటికే ఐబీఎంలో ఉద్యోగాల కోత ప్రక్రియ ప్రారంభమైందని, తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించాలని మేనేజర్లు ఆదేశించినట్టు పేరు వెల్లడించని కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి..
వ్యాపార వాతావరణాలపై మరింత క్లారిటీ వచ్చేంతవరకు ఐబీఎం కొత్త నియామకాల ప్లాన్ ను కూడా అమలుచేయాలనుకోవడం లేదని మరో అధికారి పేర్కొన్నట్టు కూడా తెలిపాయి. అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుందో ఈ టెక్ దిగ్గజం క్లారిటీ ఇవ్వన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారుల క్లౌడ్ టెక్నాలజీ ప్రయోజనాలను పెంపొందించడానికి రీస్కిల్లింగ్, రీ బ్యాలెన్సింగ్ చేపట్టే ప్రక్రియ ప్రారంభించామని ఐబీఎం తెలిపినట్టు పేర్కొన్నాయి. అయితే ఉద్యోగాల కోత అవాస్తవమని ఐబీఎం తేల్చేసింది. మొత్తం ఐబీఎంకు ఇండియాలో 1,50,000 మంది ఉద్యోగులున్నారు.
Advertisement
Advertisement