jobs losses
-
IMF Report: ఆ టెక్నాలజీతో సగానికిపైగా ఉద్యోగాలు పోతాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థల్లోని ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభం కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పును కలిగిస్తుందని, అయితే ఉత్పాదకత స్థాయిలను పెంచడానికి, ప్రపంచ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 60 శాతం ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా.. దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు బయలుదేరే కొద్దిసేపటి ముందు వాషింగ్టన్లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందన్న అంచనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజా నివేదికను ఉటంకిస్తూ పేర్కొన్నారు. సగం మంది పోయినా మిగిలినవారికి లబ్ధి ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగం పూర్తిగా పోవచ్చు లేదా మెరుగుపడవచ్చని, ఉత్పాదకత, ఆదాయ స్థాయి పెరగవచ్చని జార్జివా చెప్పారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సగం ఉద్యోగాలు పోయినప్పటికీ మిగిలిన సగం మంది ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత ప్రయోజనం పొందుతారని ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కార్మిక వ్యవస్థపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదని, అదే సమయంలో దాని ద్వారా ఉత్పన్నమయ్యే మెరుగైన ఉత్పాదకత నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే అవకాశాలను అందుకోవడానికి పేద దేశాలకు సహాయం చేయడంపై దృష్టి పెట్టాల్సిఉందని జార్జివా ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. -
ఉంటుందో..? ఊడుతుందో..?
అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు (ఎమర్జింగ్ టెక్నాలజీలు) కొందరికి మేలు చేస్తుంటే.. మరికొంత మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటి కారణంగా తామ ఉద్యోగం ఉంటుందో.. పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల గురించి టెన్షన్ పడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వేగంగా మారుతున్న ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో నైపుణ్యాలు సాధించాల్సిందేనని తాజా నివేదిక చెబుతోంది. హీరో గ్రూప్ కంపెనీ హీరో వైర్డ్ అనే కమ్యునిటీ ద్వారా రెండు లక్షల మంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌పై సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల కారణంగా ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉంటుందని 82 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావం గురించి శ్రామిక శక్తిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 78 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేగంగా మారుతున్న పని విధానానికి అనువుగా మారడానికి నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరని అంగీకరించారు. ఇదీ చదవండి: మరింత ప్రమాదకరంగా 2024..? గతేడాది చివరిలో ప్రారంభమైన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని జనరేటివ్ ఏఐ ప్రభావం ఉద్యోగాలపై తీవ్రం ఉందని, కార్పొరేట్ రంగంలో పెనుమార్పునకు అది దోహదపడనుందని చాలా మంది ప్రొఫెషనల్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా 90% మంది రాబోయే ఐదేళ్లలో ఏఐ నిపుణులకు అత్యంత డిమాండ్ ఉండనుందని అంచనా వేస్తున్నారు. అందులో 80% మంది ఉద్యోగులకు అధికంగా జీతభత్యాలు ఉండనున్నాయిని తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పలు రంగాల్లోని ఉద్యోగులను జనరేటివ్ ఏఐ టెక్నాలజీ భర్తీ చేస్తుందనే వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల గ్లోబల్ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఏర్పాడుతున్న మార్పుల కారణంగా కొద్ది ఏళ్లలోనే దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. లేబర్ మార్కెట్‌పై భారీ ప్రభావం ఉండనుందని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో మూడింట రెండోంతుల ఉద్యోగాలు ఆటోమేటెడ్‌గా మారిపోనున్నాయని తెలిపింది. -
పేరుకే హాలీవుడ్! వేలాదిగా ఉపాధి కోతలు.. అలమటిస్తున్న కార్మికులు
ప్రపంచ సినీ పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు హాలీవుడ్ (Hollywood) గురించే గొప్పగా చెప్పుకొంటాం. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు, షోలు అక్కడి నుంచే వస్తాయి. సాంకేతిక విలువల్లో ఏ మాత్రం రాజీ పడకుండా చిత్రాలు నిర్మిస్తుంటారు అక్కడి దర్శక నిర్మాతలు. అయితే అంతటి ప్రాముఖ్యత ఉన్న హాలీవుడ్లో ఓ వైపు స్ట్రైక్‌లు కొనసాగుతుండగా మరోవైపు వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. గత సెప్టెంబరులో అమెరికాలో 3,36,000 ఉద్యోగాలు పెరిగాయి. బ్లూమ్‌బెర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు ఊహించిన దాని కంటే ఇది దాదాపు రెండింతలు. అయితే ఇందుకు భిన్నంగా హాలీవుడ్లో ఉపాధి కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం , చలనచిత్రం, సౌండ్ రికార్డింగ్ పరిశ్రమలలో ఆగస్ట్‌లో 17,000 మంది ఉపాధి కోల్పోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో మరో 7,000 మంది ఉపాధి కోల్పోయారు. హాలీవుడ్లో మే నెలలో సమ్మెలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 45,000 మంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,60,000 మంది నటీ నటులు, అనౌన్సర్లు, రికార్డింగ్ కళాకారులు, ఇతర మీడియా నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ SAG-AFTRA అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP)తో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన తర్వాత జూలై 14న సమ్మె ప్రారంభించింది. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్, ఎన్బీసీ యూనివర్సల్, పారామౌంట్, సోనీతో సహా ప్రధాన స్టూడియోల తరపున AMPTP సంప్రదింపులు చేస్తుంది. -
ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
-
ఉద్యోగాల కోతను ఖండించిన టెక్ దిగ్గజం
ముంబై : ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోత ఆందోళనతో కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా.. పలుకుకపోయినా.. టెకీలకు దడపుట్టిస్తూ రిపోర్టులు వస్తున్నాయి. వచ్చే క్వార్టర్లో మరో మల్టినేషనల్ ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా 5000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని ఇండస్ట్రీలో రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ రిపోర్టులన్నీ అవాస్తవమంటూ ఆ టెక్ దిగ్గజం స్పష్టంచేసింది '' ఈ రిపోర్టులు వాస్తవానికి తప్పు. రూమర్లు, ఊహాగానాలపై మరింత మాట్లాలనుకోవడం లేదు'' అని ఐబీఎం ఇండియా అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే త్రైమాసికంలో ఐబీఎం దాదాపు 5000 మంది భారత ఉద్యోగులను ఇంటికి పంపించేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ఆటోమేషనల్ ప్రభావంతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ లు కంపెనీలు కూడా ఉద్యోగాల కోతపై వార్నింగ్ ఇచ్చేశాయి. వీటి జాబితాలోనే ఐబీఎం కూడా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలిపాయి. ఇప్పటికే ఐబీఎంలో ఉద్యోగాల కోత ప్రక్రియ ప్రారంభమైందని, తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించాలని మేనేజర్లు ఆదేశించినట్టు పేరు వెల్లడించని కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పినట్టు రిపోర్టులు వచ్చాయి.. వ్యాపార వాతావరణాలపై మరింత క్లారిటీ వచ్చేంతవరకు ఐబీఎం కొత్త నియామకాల ప్లాన్ ను కూడా అమలుచేయాలనుకోవడం లేదని మరో అధికారి పేర్కొన్నట్టు కూడా తెలిపాయి. అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుందో ఈ టెక్ దిగ్గజం క్లారిటీ ఇవ్వన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారుల క్లౌడ్ టెక్నాలజీ ప్రయోజనాలను పెంపొందించడానికి రీస్కిల్లింగ్, రీ బ్యాలెన్సింగ్ చేపట్టే ప్రక్రియ ప్రారంభించామని ఐబీఎం తెలిపినట్టు పేర్కొన్నాయి. అయితే ఉద్యోగాల కోత అవాస్తవమని ఐబీఎం తేల్చేసింది. మొత్తం ఐబీఎంకు ఇండియాలో 1,50,000 మంది ఉద్యోగులున్నారు.