సాక్షి,న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉద్యోగులకు తీపికబురు అందనుంది. అరకొర వేతన పెంపుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు 2018లో మాత్రం ఊరట కలగనుంది. 2017లో భారత ఉద్యోగుల వేతనాలు 8-10 శాతం పెరిగితే..2018లో పలు రంగాల ఉద్యోగులకు 10-15 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని ప్రముఖ మానవనరుల కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. మరోవైపు నియామకాలు సైతం వచ్చే ఏడాది భారీగా ఊపందుకోనున్నాయనే అంచనాలూ జాబ్ మార్కెట్‌లో ఉత్తేజం నింపుతున్నాయి.
టెక్నాలజీ, ఫైనాన్షియల్ సేవలు, రిటైల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చోటుచేసుకోనున్నాయి. ఐటీలో సంప్రదాయ ఉద్యోగాలతో పాటు డిజిటల్, డేటా సైన్స్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.
వచ్చే ఏడాది ప్రధానంగా మౌలిక, టెలికాం, తయారీ, ఐటీ రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతుందని, ఫలితంగా నియామకాలు భారీగా పెరుగుతాయని హెచ్‌ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment