
ముంబై: రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. స్థానిక సంస్థలు వాటి ఆదాయార్జన సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే దేశ సమాఖ్య సారాంశం.
ఎటువైపు బలహీనత ఉన్నా అది దేశానికి సవాళ్లను విసురుతుంది. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా దాస్ పేర్కొన్నారు.