రుణ మోసాలపై సత్వర నివేదికలు ఇవ్వండి: ఆర్‌బీఐ
ముంబై: రుణ మోసాలపై క్రియాశీలంగా సత్వర చర్యలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తోంది. త్వరితగతిన ఈ సమాచారాన్ని అందించాలని, సమయాన్ని వృధా చేయరాదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. సంబంధిత రుణ మోసాలు, మొండిబకాయిల విషయంలో నాలుగేళ్ల సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని ఆయన పేర్కొన్నారు. ఒక రుణ గ్రహీతను ‘ఫ్రాడ్’ అని ప్రకటించే నాలుగేళ్ల ముందే అతని రుణం మొండిబకాయిగా గుర్తించిన సందర్భాలను తాము గమనిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ మోసాల్లో 92 శాతం రుణాలతో సంబంధం ఉన్నవేనని ఆయన అన్నారు.