ఇన్ఫ్రా కంపెనీలకు 4,500 కోట్ల అక్రమ పన్ను ప్రయోజనం! | Reliance Ports gets Rs 1,767 crore irregular tax benefit: CAG | Sakshi
Sakshi News home page

ఇన్ఫ్రా కంపెనీలకు 4,500 కోట్ల అక్రమ పన్ను ప్రయోజనం!

Published Wed, Nov 23 2016 1:13 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

ఇన్ఫ్రా కంపెనీలకు 4,500 కోట్ల అక్రమ పన్ను ప్రయోజనం! - Sakshi

ఇన్ఫ్రా కంపెనీలకు 4,500 కోట్ల అక్రమ పన్ను ప్రయోజనం!

ఐటీ శాఖకు కాగ్ అక్షింతలు
రిలయన్‌‌స పోర్ట్స్ విషయంలో 
రూ.1,767 కోట్లు 

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా కంపెనీలకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) రూ.4,500 కోట్ల అపసవ్య పన్ను ప్రయోజనం కల్పించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. ఆయా కంపెనీలకు ఐటీ శాఖ ‘అక్రమ’ పన్ను కోతలకు  అనుమతి ఇచ్చినట్లు వివరించింది. ఎటువంటి పరిశీలనలూ జరపకపోవడం తాజా అవకతవకలకు ప్రధాన కారణంగా పేర్కొంది.   రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అనుబంధ పోర్ట్స్ అండ్ టెర్మినల్ లిమిటెడ్‌కు సంబంధించి ఈ మొత్తం రూ.1,767 కోట్లని పేర్కొంది. గుజరాత్‌లోని పోర్ట్ సిక్కాలో నాలుగు ‘క్యాపిటివ్ జెట్టీస్’ నిర్మాణం విషయంలో ఈ అవకతవకలు చోటుచేసుకున్నట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక వివరించింది.

ప్రజా ప్రయోజనాల రీత్యా వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొని పన్ను ప్రయోజనాలు పొందినప్పటికీ, సంస్థ అవసరాలకోసమే వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ట్యాక్స్ హాలిడేకి సంబంధించి సెక్షన్ 80ఐఏ కింద పన్నుల మినహారుుంపులు,  ఖజానాకు ఆదాయంపై ప్రభావం వంటి అంశాలను పరిశీలించుకోడానికి సీబీడీటికి తగిన ఎటువంటి యంత్రాంగం లేదని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి కాగ్ జాబితాలో ఉన్న ఇతర కంపెనీల్లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ (రూ.340 కోట్లు), రిలయన్‌‌స ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ.51.88 కోట్లు), టాటా పవర్ (రూ.340 కోట్లు), రిలయన్‌‌స ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ.51.88 కోట్లు), టాటా పవర్ (రూ.36.99 కోట్లు), గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ (రూ.22.75 కోట్లు) ఉన్నారుు. 2012-13, 2014-15 మధ్య కాగ్ నిర్వహించిన ఆడిట్ ప్రాతిపదికన తాజా నివేదిక రూపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement