ముంబై: ఇరాక్ లో యుద్ధ వాతావరణంతో గత నెల్లో బలహీనపడిన రూపాయి కాస్త లాభపడింది. తాజాగా అమెరికన్ డాలర్ మారకంతో రూపాయి విలువ 16 పైసలు పెరిగింది. నాటి ప్రారంభ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ రూ. 59.85గా ట్రేడయింది. విదేశీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతుండటం, బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ అమ్మకాలను పెంచడం లాంటి అంశాలు రూపాయి విలువ పెరగడానికి దోహదపడ్డాయి. జూన్ నెలలో యూఎస్ ఉద్యోగాల నివేదికతో ఫెడరల్ రిజర్వ్ పై ఒత్తిడి పెరగడంతో డాలర్ మారకం పదేపదే హెచ్చరిల్లుతూ వచ్చింది.
కాగా ఫారెన్ ఎక్సెంజ్ మార్కెట్ లో డాలర్ మారకంతో రూపాయి విలువ తొలుత రూ. 60.01 తాకినా గరిష్టంగా రూ. 59.93కు చేరుకుంది. అనంతరం8 పైసలు తగ్గి 59.85 వద్ద స్థిరపడింది.