⇒ 18 నెలల గరిష్ట స్థాయి నుంచి 18 పైసల క్షీణత
⇒ 65.03 వద్ద ముగింపు
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం సోమవారం18 పైసలు క్షీణించి 65.03 వద్ద ముగిసింది. రెండు నెలల కాలంలో ఈ స్థాయిలో రూపాయి క్షీణించడం ఇదే తొలిసారి. బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి పతనమైందని ట్రేడర్లు పేర్కొన్నారు. విదేశాల్లో డాలర్ బలపడినప్పటికీ, స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉండడంతో నష్టాలు తగ్గాయని వివరించారు. ఈ వారంలోనే ఆర్‌బీఐ పాలసీ ఉన్నందున కరెన్సీ ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారని తెలిపారు.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(64.85)తో పోల్చితే సోమవారం 64.80 వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 18 నెలల గరిష్టానికి,64.76కు చేరింది. 2015, అక్టోబర్ 23 తర్వాత రూపాయి ఈ స్థాయికి బలపడడం ఇదే మొదటిసారి. అయితే మధ్యాహ్నం తర్వాత డాలర్లకు డిమాండ్ పెరగడంతో 65.09 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 18 పైసలు (0.28శాతం) క్షీణించి 65.03 వద్ద ముగిసింది.
ఒడుదుడుకుల రూపాయి
Published Tue, Apr 4 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement
Advertisement